ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎంతలా మార్చేసిందో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే స్థాయిలో ప్రభావాన్ని చూపుతోంది. ఇంటర్నెట్ కు ముందు ప్రపంచం ఎలా ఉండేదో ప్రస్తుతం జీవించి ఉన్న వారికి బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. గత 15 ఏళ్లలోనే ఇంటర్నెట్ చాలా అభివృద్ధి చెందింది. మారుమూల ప్రాంతాలలో కూడా ఇంటర్నెట్ సిగ్నల్స్ చాలా గట్టిగానే అందుతున్నాయి. ఇండియాలో కూడా ఇంటర్నెట్ వినియోగం చాలా మారిపోయిందని చెప్పవచ్చు.



కమ్యూనికేషన్ విప్లవంలో ఇంటర్నెట్ అనేది చాలా కీలకమైన పాత్ర వ్యవహరిస్తోంది. ఇంటర్నెట్ అన్ని రకాలుగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అటు మంచికి మంచి, చెడుకు చెడు, హింసకు అహింసకు, ఇలా అన్నిటికీ కూడా ఇంటర్నెట్ ని వినియోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏఐ కూడా అచ్చం ఇలానే ఇంటర్నెట్ లాగానే అన్ని రకాలుగా మానవ జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తోందని టెక్ పండితులు తెలియజేస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చి రావడంతోనే సమాజంలో చాలా భిన్నమైన వర్గాల వారి ఉపాధిలను కూడా దెబ్బతీసేలా కనిపించింది.



ఇంటర్నెట్ వినియోగం ఎక్కువ అయ్యాక .. ఇంటర్నెట్ అందించే సంస్థలు సేవలు జనాలకు ఒకరకంగా అవసరం లేకుండానే పోయాయని చెప్పవచ్చు. వాట్సప్ ద్వారా ఇంటర్నెట్ తోనే ఫోన్ కాల్స్ సదుపాయం ఉచితంగానే చేసుకుని వెల్స్ బాటు కనిపించింది. ఇంటర్నెట్ వచ్చాక అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల కంపెనీలు కూడా భారీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. గతంలో నిమిషం మాట్లాడితే చాలు రెండు రూపాయలు ఖర్చయ్యేది.కానీ ఇప్పుడు నెల అంతా కూడా మాట్లాడుకున్న 200 రూపాయలే అవుతోంది. ఇంటర్నెట్ ద్వారా మొబైల్ యాప్స్ ఎక్కువగా వినియోగించడం కనిపిస్తోంది. ప్రపంచం కూడా రోజురోజుకీ వేగంగానే మారుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లేకపోతే స్తంభించిపోయేలా కనిపిస్తున్నారు ప్రజలు.



మొత్తం మనిషి అంతా కూడా ఇంటర్నెట్ సిగ్నల్ మీదే ఆధారపడి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొన్ని రంగాలలో ఇప్పటికీ ఏ ఐ ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో ఇంటర్నెట్ కూడా అంతే కొంత సీరియస్ రంగాలలో ఆ తర్వాత కొన్ని సరదా రంగాలలో వచ్చిన నెమ్మదిగా అటు బ్యాంకింగ్ సేవలు మీడియా వంటి సేవలలో కూడా ఇప్పుడు కీలకంగా మారింది దీంతో సోషల్ మీడియాలో జనాలకు సరదాను అందించడంలో ముందుంది. అంతేకాకుండా స్మార్ట్ మొబైల్స్ కి యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితం యాప్స్ తోనే పెనువేసుకుపోయింది.


ఇప్పుడు ఏఐ కూడా సర్వీస్ సెక్టార్లో చాలా కీలకంగా ఉండబోతుందట. ఇంటర్నెట్ చుట్టూరా సర్వీస్ సెక్టార్ తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఏఐ సర్వీస్ సెక్టార్లలో తడాఖా చూపించబోతోంది. జనరేటర్ ఏఐ ప్రోగ్రామింగ్ ఐటి రిలేటెడ్ సర్వీసులకు ఎక్కువగా ఏఐ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఈ విషయాలను సగర్వంగా చెప్పుకున్నారు. ముఖ్యంగా 30 % వరకు కోడింగ్ చేస్తుందని తెలియజేస్తున్నాయి. ఇది ఇంకా ఆరంభమే అనుకుంటే ముందు ముందు ఏ స్థాయిలో ఏఐ ప్రభంజనం ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. రాబోయే రోజుల్లో ఉద్యోగులకే యేసరు పెట్టేలా ఉంటుందట ఏఐ.


కానీ పూర్తి కోడింగ్ అనేది ఏఐకి ఇవ్వడం ఉండదని.. 90 శాతం వరకు వెళ్లే అవకాశం ఉందని మనిషి చేయడానికి కేవలం 10 శాతం మాత్రమే మిగులుతుందని పలు టెక్ పండితులు తెలియజేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కోట్ల కొద్ది ఉద్యోగాలు పోతాయని అదే సమయంలో కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేస్తున్నారు. ఏఐ వల్ల ఏడు కోట్ల ఉద్యోగాలు పోతాయని.. అయితే ఏఐ కోసం తొమ్మిది కోట్ల మంది ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వాళ్ళు ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేస్తున్నది. మరి ఇందులో ఏది నిజం అవుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: