ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశం. ముఖ్యంగా గత మూడు పర్యాయాలు బీజేపీ పాలనలో ఇండియా చాలా వరకు అప్ గ్రేడ్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నాలజీలో  ఇండియా కూడా ఇతర దేశాలతో పోటీపడుతోంది. అలాంటి ఈ తరుణంలో ఇప్పటికే ఇండియాలో  ట్రైన్ల విషయంలో ఇతర దేశాలతో  పోటీ పడుతూ దూసుకెళ్తోంది భారత్.. కామన్ రైళ్ల నుంచి మొదలు వందే భారత్ ఎక్స్ప్రెస్ వరకు మన ఇండియాలో అద్భుతమైనటువంటి  అభివృద్ధిని సాధించింది. వేలాది కిలోమీటర్ల ప్రయాణమైనా గంటల్లో చేరుకుంటున్నారు. అలా ట్రైన్ల విషయంలో  భారత్ ఇంకా టెక్నాలజీ జోడించి కొత్త కొత్త ట్రైన్లను తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నమో భారత్ స్టేషన్ల పేరుతో సరికొత్త ట్రైన్స్ రాబోతున్నాయి. 

ఇది ఇండియాలో పూర్తయితే మాత్రం ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. మరి ట్రైన్ యొక్క ప్రత్యేకత ఏంటి వివరాలు చూద్దాం..చరిత్రలోనే అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులను ఈశాన్య రాష్ట్రాలు,  కాశ్మీర్ లో కట్టుకొచ్చారు.. అలాంటి మరో ప్రాజెక్టు నమో భారత్ స్టేషన్ ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ ఈ మూడింటిని కలిపి ఆర్ఆర్ టీస్ కారిడారిగా ఫిక్స్ చేశారు. ఇప్పటికే నిర్మాణ పనులు కూడా పూర్తయిపోయాయి. అయితే దీన్ని సారాయి కలేఖాన్ అనే ప్రాంతంలో  నిర్మించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా ప్రారంభానికి రెడీ అవుతోంది. అయితే ఇది దేశంలోనే మూడు రూట్లకి ఒక జంక్షన్ గా  మారబోతోంది.

ఇది విజయవంతం అయితే మాత్రం రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి హబ్ కావచ్చని భావిస్తున్నారు. ఎలాగంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీ కేంద్రంగా ఇలాంటి ప్రాజెక్టు ఏపీలో తీసుకొచ్చిన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ దిశగానే కేంద్రం కూడా ఆలోచన చేసే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు. ఈ విధంగా ఈ ఆర్ఆర్ టిఎస్ అనేది రాబోవు రోజుల్లో  తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. మరి చూడాలి మోడీ కరుణించి తెలుగు రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టును అందిస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: