
అయితే అందుతున్న నివేదికల ప్రకారం కమలహాసన్ నెలవారి జీతం.. రూ.1,24,000 రూపాయలు ఉంటుందని.. వీటికి తోడు పార్లమెంటు సమావేశాలలో ప్రతిరోజు అదనంగా 2,500 .. అలాగే ఆఫీసు ఖర్చులకు ప్రతినెల రూ .75 వేల రూపాయలు, సిబ్బందికి రూ .50వేల రూపాయలు ఇతరత్రా కార్యక్రమాల అవసరాల కోసం రూ .25 వేలు ఇలా ప్రతినెల సుమారుగా రూ.2,81,000 వరకు లభిస్తుందట.
అలాగే ప్రతి ఏడాది 34 ఉచిత విదేశీ విమాన ప్రయాణాలు ఉంటాయి. (కుటుంబంతో నైనా లేకపోతే సహాయకులతోనైన 8 మంది ప్రయాణించవచ్చు)
అధికారికంగా లేకపోతే వ్యక్తిగత ఉపయోగం కోసం ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం చేయవచ్చు.
అలాగే న్యూఢిల్లీలో రెంట్ ఇల్లు, 50వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి సంవత్సరానికి 4,000 ఉచిత నీరు. అలాగే ఉచితంగా మొబైల్ ,ఇంటర్నెట్ సేవలు.. ప్రభుత్వ అధికారులకు అందించే వైద్య సంరక్షణకు సమానంగానే వైద్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మొబైల్ , ల్యాప్ టాప్ వంటివి ఉచితంగానే ఉంటాయి. ఇక పదవి విరమణ తర్వాత ప్రతినెలా కూడా రూ .31,000 రూపాయలు లభిస్తుంది అలాగే 5 సంవత్సరాలు దాటి సేవ చేసిన వారందరికీ కూడా ప్రతి ఏడాది అదనంగా రూ .2500 రూపాయలను ఇస్తారట. ఈ రాజ్యసభ పదవీకాలం కేవలం ఆరు సంవత్సరాలు ఉంటుంది. ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి మూడింట్లో ఒక వంతు సభ్యులు పదవి విరమణ చేస్తూ ఉంటారు.