
మీరు ఎన్ఆర్ఐలు కాదు...ఎంఆర్ఐలు
నాకు ఇష్టమైన, నేను స్పూర్తి పొందిన నాయకుల్లో లీ కువాన్ యూ ఒకరు. 31 ఏళ్లు నిరంతరంగా ప్రధాన మంత్రిగా పనిచేసి ఒక్క మత్స్యకార గ్రామాన్ని గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా మార్చారు. సింగపూర్ లో తెలుగు వారి ఉత్సాహం సూపర్. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన దగ్గర నుండి తెలుగు ప్రవాసుల సమావేశం వరకు ఎక్కడ చూసిన తెలుగువాళ్లే. నేను సింగపూర్‌లో ఉన్నానా లేక సింహాచలంలో ఉన్నానా అని సందేహం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన తెలుగు వారి ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చాక కూడా నాకో విషయం అర్ధం అయింది. సింగపూర్ ని శాసించేది కూడా తెలుగువాళ్లే. అందరూ మిమ్మల్ని ఎన్నారైలు అంటారు అంటే ప్రవాస భారతీయులు. కానీ నా మనసులో ఎప్పుడు మీరు ఎంఆర్ఐలే... MRI అంటే అత్యంత విశ్వసనీయ భారతీయులు (Most Reliable Indians).
మన బ్రాండ్ సిబిఎన్!
ప్రతి దేశానికి, ప్రతి వస్తువుకి ఒక బ్రాండ్ ఉంటుంది.. సింగపూర్ అంటే అభివృద్ధి. ఏపీలో అభివృద్ధి అంటే సిబిఎన్.. ఇది మన బ్రాండ్. సిబిఎన్ బ్రాండ్ తో ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పెట్టుబడులు వస్తాయి. బ్రాండ్ ఎపి ప్రమోషన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. రాష్ట్రానికి పెట్టుబడులను సాధించే మా ప్రయత్నాలకు మీ సహకారం అవసరం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రోల్ మోడల్ సింగపూర్ ని ఆదర్శంగా తీసుకుని నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపారమైన వనరులు ఉన్నాయి. మన రాష్ట్రం లో అభివృద్ధికి అవకాశాలు చాలా ఉన్నాయి. దాదాపు 1000 కిలోమీటర్లకి పైగా తీర ప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, నౌకాశ్రయాలు, భూములు కనెక్టివిటీ ఉన్న మన రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ కానుంది. క్వాంటం వ్యాలీతో ప్రపంచమే మన వైపు చూస్తుంది. టిసిఎస్, కాగ్నిజెంట్, ఎఎన్ఎస్ఆర్, సత్వ, సిఫీ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఎపికి వస్తున్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమృత లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. బిట్స్ పిలానీ త్వరలోనే రాష్ట్రానికి రానుందని లోకేష్ తెలిపారు.
ఉద్యోగాల కల్పనే మన నినాదం..!
మానవవనరులు, మౌలిక సాదుపాయాలున్న మన రాష్ట్రానికి పెట్టుబడుల ప్రతిపాదనలతో రండి... అనుమతులు తీసుకొని వెళ్లండి... యువతకు ఉద్యోగాలను కల్పించండి... 20 లక్షల ఉద్యోగాల కల్పన – ఇదే మన నినాదం... ఇదే మన విధానం. అప్పట్లో చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపుతో జన్మభూమి కార్యక్రమానికి ఎన్నారైలు అండగా నిలిచారు. నేడు జీరో పావర్టీ లక్ష్యంగా చంద్రబాబు గారు తలపెట్టిన P4 కి ఎన్నారైల సహకారం కోరుతున్నాం. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలన్నదే చంద్రబాబు గారి కోరిక. ఆరోగ్యవంతమైన, సంపన్నవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి పని చేద్దాం. P4 లో మార్గదర్శిగా చేరండి.. పేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలి.
డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి.. !
ఒకేరాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో ఎపిలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోంది, కేంద్రంలో నరేంద్ర మోడీజీ, ఎపిలో చంద్రబాబుగారి నేతృత్వంలో పనిచేస్తున్నాం. అయిదేళ్లలో నష్టపోయిందంతా వడ్డీతో సహా తీసుకొస్తాం. ఇతరదేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎంఎస్ఎంఇ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తాం, ప్రపంచవ్యాప్తంగా 80శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎస్ఈల ద్వారానే వస్తున్నాయి. టిసిఎస్ లో 35శాతం తెలుగువారు పనిచేస్తున్నారు, అందుకే ఎపికివస్తున్నామని టాటా చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు. శాసనసభ్యుల్లో 50శాతం మంది కొత్తవారు ఉన్నారు, మంత్రివర్గంలో 17మంది కొత్తవారు, మీరంతా సహకరిస్తే ఎపిని నెం.1గా తయారుచేస్తాం అని తెలిపారు.
అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తాం. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. సింగపూర్ లో ఇంతమంది తెలుగువారు రావడం ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఉన్నవారిలో ఒక ఎనర్జీ కనపడుతోంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కసి మీలో ఉంది. ఎపి ఎన్ ఆర్ టి 2.0 ప్రారంభించాం, ఎన్ఆర్ఐలకు ఎటువంటి సమస్యలున్నా ఎపిఎన్ఆర్ టి మీకు అండగా ఉంటుంది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు భారత్ భూభాగంలో వచ్చినపుడు మొదటిసారి దేశప్రధాని ఉగ్రవాదుల క్యాంప్ పై మెరుపుదాడులు చేయించారు. ఆ దాడుల్లో మన రాష్ట్రానికి చెందిన మురళీనాయక్ వీరమరణం పొందారు, అంతకు ముందు నాకు ఏదైనా అయితే ఆయన దేశం నావెనుక ఉంటుందని మురళీ నాయక్ చెప్పారు. అటువంటి జవానుకు మనమంతా నివాళులర్పించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు