తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టిడిపి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారిని ప్రపంచపటంలో నిలబెట్టింది మన బ్రాండ్ సిబిఎన్. చంద్రబాబు గారు ఆరోజు ఐటీ అంటే కంప్యూటర్లు తిండి పెడతాయా అని కొందరు విమర్శలు చేసారు. చంద్రబాబు గారు ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేసినప్పుడు కూడా విమర్శించారు. కానీ ఈ రోజు  ఆ కంప్యూటర్లతోనే తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు.  ఆది విజనరీ అంటే... అదీ సిబిఎన్ బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది తెలుగు ప్రవాస భారతీయులు ఉన్నారు. ఒక్క ఫార్ ఈస్ట్ లోనే  3 లక్షల మంది ఉన్నారు. సింగపూర్ లో జరుగుతున్న ఈ తెలుగు ప్రవాసుల సమావేశానికి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇతర ఫార్ ఈస్ట్ దేశాల నుండి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు... ఆదీ మన శక్తి.


ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కీలకపాత్ర
కష్టపడి చదువుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు.  ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తూ తెలుగువారు సత్తా చాటుతున్నారు. మనిషి సింగపూర్ లో, మలేషియాలో ఉన్నా... మీ మనసంతా ఎప్పుడూ మన రాష్ట్రం పైనే ఉంటుంది. రాష్ట్రం పై మీకు ఎంత ప్రేమ ఉందో గత ఎన్నికల్లో చూసాను. రాష్ట్రం లో సైకో పాలన పోవాలని ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఏకమయ్యారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులకి జైలులో పెట్టినపుడు బాధపడ్డాం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెట్టారు... ఇటువంటి రాజకీయాలు అవసరమా అని బ్రాహ్మణి నాతో అంది. అప్పుడు నేను కూడా ఆలోచనలో పడ్డాను. కానీ అదే రోజు హైదరాబాద్‌లో ఉన్న ఐటీ నిపుణులు అంతా కలిసి ఒక భారీ కాన్సెర్ట్ నిర్వహించారు. ఆయనని జైలులో పెట్టిన 53 రోజులు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరంతా సెలవలు పెట్టి మరీ రాష్ట్రానికి వచ్చి పని చేసారు. కూటమి ప్రభుత్వం 94% స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు గెలవడంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారు.  ఎన్ఆర్ఐలకు 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాము, నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చాం అని తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: