
సమ్మిట్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆరుగురు మంత్రులతో కూడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా నియమితులయ్యారు. సమ్మిట్‌లో పాల్గొనే అతిథులకు వసతులు, రవాణా, భద్రత వంటి ఏర్పాట్ల కోసం తొమ్మిది వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ ఉత్తర్వులను ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ జారీ చేశారు.
ఈ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా మార్చే దిశగా ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. పరిశ్రమలు, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమ్మిట్ వేదికగా ఉపయోగపడనుంది. చంద్రబాబు ఇటీవల సింగపూర్ పర్యటనలో విదేశీ పెట్టుబడిదారులను విశాఖ సమ్మిట్‌కు ఆహ్వానించారు. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు