
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైనే కావస్తువున్న.. పార్టీల మధ్య సమన్వయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు కానీ.. అక్కడక్కడ మాత్రం నేతల మధ్య ఏదో తేడా కొడుతున్నట్లుగా కనిపించింది. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వరం మారబోతోందనే విధంగా వినిపిస్తోంది. అందుకు కారణం కేబినెట్ మీటింగ్లో ఆయన వ్యవహరించిన తీరే ఇందుకు కారణమని అంటున్నారు.కేబినెట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ అడ్డు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
ఇటీవలె రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ విషయంలో చాలా అభ్యంతరం పెట్టారట పవన్ కళ్యాణ్.. రైతులు అభిప్రాయం లేకుండా తీసుకోకూడదని తన అభిప్రాయంగా తెలిపారు. అంతేకాకుండా తాజాగా నాలా చట్ట సవరణ ప్రతిపాదనకు కూడా అడ్డుపడ్డారట పవన్ కళ్యాణ్. నాలా అంటే వ్యవసాయ భూమిని.. వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చట. దీనివల్ల వ్యవసాయ భూమి దుర్వినియోగం అవ్వడమే కాకుండా రైతులకు కూడా ఇబ్బంది పడతారని పవన్ కళ్యాణ్ ఆపివేశారట.
కొన్ని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ విషయంలో కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అడ్డుకట్టు వేసినట్లు వినిపిస్తున్నాయి.. అలా కేబినెట్లో కొన్ని కీలకమైన అంశాల విషయంలో పవన్ కళ్యాణ్ చెప్పడంతో అక్కడ ఇబ్బందికరంగా మారిందనే విధంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మరికొన్ని కీలకమైన అంశాలు వాయిదా వేశారు.కూటమి నేతల మధ్య కూడా ఇలాంటి ఇబ్బంది కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాటు సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారన్నది రాజకీయాల్లో బిగ్ క్వశ్చన్ గా మారింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న గుడ్డిగా పోకుండా.. ఆచితూచి అడుగులు వేసి వ్యవహరిస్తేనే జనసేన పార్టీకి కూడా భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.