చంద్రబాబు పేరు చెబితే… వైసీపీ నేతలు ఎప్పుడూ ఒకే మాట చెబుతుంటారు – "ఏ పథకం బాబు ఇచ్చాడో చెప్పండి!" అంటూ విమర్శలు చేస్తారు. కానీ ప్రజలు మాత్రం ప్రశ్నిస్తున్నారు – “అయ్య..! పెన్షన్ ఎవరు పెంచారు?” అని. మాటలు మాటలుగానే వదిలేసినా, గ్రౌండ్ లో జరిగేదే నిజం. ఆ నిజమే చంద్రబాబు నాయుడికి కలిసొస్తోంది. తాజాగా టీడీపీజనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముందు రోజుల్లో నెలకు 225 రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను బాబు తొలి టర్మ్‌లోనే రూ.1000 చేశారు. ఆపై రూ.2000, రూ.3000 చేశారు. ఇప్పుడు నాలుగు వేల రూపాయలదాకా పెంచారు. ఎన్నికల సమయానికి ఈ మొత్తం ఏకంగా రూ.5000 కి చేరుతుందని సమాచారం!

ఇది మాటలకే పరిమితం కాదు – దేశంలోనే ఎక్కడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరగడం లేదు. ఇది ఎక్స్ క్లూజివ్ గా టీడీపీ పాలనలోనే సాధ్యమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తున్న ఘనత చంద్రబాబుదే! ప్రతీ నెలా తొలి తేదీన మ‌డబ్బులు వారి చేతికి తాకేలా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే – “పధకాలు ఎవరు ఇచ్చారు మేము మర్చిపోవం బాబూ!” పెన్షన్ మాత్రమే కాదు – కిడ్నీ బాధితులకు నెలకు రూ.15,000, దివ్యాంగులకు రూ.6000 లాంటి లక్ష్యపూరిత సంక్షేమంతో అర్హులందరికీ సహాయం అందేలా చేస్తున్నారు. ఒక నెల తీసుకోకపోతే, త‌ర్వాత‌ నెల డబుల్ చేసేస్తున్నారు. అంతే కాదు… వితంతువులు, వృద్దులు, అనాధలు, వృత్తివేత్తలు, చేతివృత్తుల వారు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది.  ఎన్టీఆర్ భరోసా"గా పేరొందిన ఈ స్కీమ్ నిజంగా పేదలకో శ్వాసలా మారింది.

ఇవే కారణంగా ఇప్పుడు టీడీపీకి అతి పెద్ద ఓటు బ్యాంక్ గా గట్టెక్కుతోంది. 65 లక్షల మంది పెన్షన్ దారుల్లో ఎక్కువ మంది బాబుపై మోజు చూపుతుండగా, వారి కుటుంబ సభ్యులందరూ కూడా అదే దిశగా ఉన్నట్టు పార్టీలో భావన. అందుకే చంద్రబాబు ప్రతి నెలా మొదటి తారీఖున ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా పక్కన పెట్టి, స్వయంగా పేదల వద్దకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. ఆ క్షణంలో వచ్చే ఆనందాన్ని, వారి కళ్ళల్లో మెరుపును బాబు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇంత చేసిన తర్వాత… ప్రచారం చేసుకోవడంలో తప్పేం ఉంది? ఇది ప్రచారం కాదు… ప్రజల గుండెల్లో పడే నిజం! పథకాల పరంగా టీడీపీ "సూపర్ సిక్స్" లైనప్ తూచగా సాగిపోతున్నా, ఈ పెన్షన్ పథకం మాత్రం చంద్రబాబుకి శ్రీరామ రక్షలా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: