ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు నిరుద్యోగులు. అయితే అలా సంపాదించిన తర్వాత కొంతమంది అక్రమంగా డబ్బులు సంపాదించి కోట్ల రూపాయల సంపాదిస్తున్నారు. అలా ఇప్పుడు తాజాగా రూ.15వేల రూపాయల జీతానికి పనిచేసే ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు రూ .30 కోట్లకు పైగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన కర్ణాటక ప్రాంతంలోని కొప్పల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్ణాటక అంతా కూడా పెను సంచలనాలను సృష్టిస్తోంది.


పూర్తి వివరాలలోకి వెళితే..కర్ణాటక ప్రాంతంలో కలకప్ప నిండగుండి అనే వ్యక్తి..KRIDL  ఇందులో 20 సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ క్లర్కుగా పనిచేస్తున్నారు. ఇతని జీతం రూ .15 వేల రూపాయలు అయినప్పటికీ.. ఆదాయానికి మించి మరి ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వినిపించడంతో నిండగుండి ఇంట్లో అధికారులు సోదా చేపట్టారు. KRIDL లో రూ .72 కోట్ల నిధులు దుర్వినియోగానికి సంబంధించి జరిగిన విచారణలో భాగంగా అందరి ఇళ్లల్లో సోదాలు చేశారు.. ఈ క్లర్క్ కి మొత్తం 24 ఇల్లు.. 40 ఎకరాల భూమి, 35 తులాల బంగారు, 1.5 కిలోల వెండి ఆభరణాలు, ఆరు చోట్ల స్థలాలు, పలు రకాల డాక్యుమెంట్లు, పలు రకాల వాహనాలను స్వాధీనం చేసుకున్నారట.



నిండగుండి, అందులోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న జరనప్ప,M. చించోలిరికలు 2019 నుంచి 2025 వరకు 96 నకిలీ ప్రాజెక్టులను రూపొందించాలని అనుమానాలు రావడంతో (త్రాగునీటి పనులు, రోడ్లు డ్రైనేజీ) తనిఖీలు చేశారు .. ఈ పనులు చేశామంటూ రూ.72 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లుగా అధికారులు కనుక్కున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన KRIDL డైరెక్టర్ బసవరాజు ఇందుకు సంబంధించి ఆదేశాలను కూడా జారీ చేశారు. ఇందులో పనిచేస్తున్న కొంతమంది పైన  ఫిర్యాదులు చేయగా.. లోకాయుక్త అధికారులు తనిఖీ చేపట్టారు.. దీంతో నిండగుండి క్లర్కును గడిచిన కొద్ది రోజుల క్రితం ఉద్యోగం నుంచి తొలగించినప్పటికీ కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఇంకా ఉద్యోగంలోనే కొనసాగుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: