ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు జగన్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. హోమ్ మంత్రి అనిత పొగాకు రైతుల దగ్గరకు వెళ్లిన జగన్ కు కేజీకి, టన్నుకు తేడా తెలియదు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మామిడి రైతుల దగ్గరకు వెళ్లి జగన్ మామిడికాయలను తొక్కించారని అనిత తెలిపారు.

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం తొలి  విడత నిధుల కార్యక్రమాన్ని అనిత మొదలుపెట్టారు.  రైతుల విషయంలో రాజకీయం చేయరాదని అనిత హితవు పలికారు. రాజకీయం చేయడానికి వైసీపీ నాయకులు వ్యవసాయాన్ని  అడ్డు పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు.  కూటమి సర్కార్ రైతులకు మేలు చేసేలా  పథకాలను అమలు చేస్తుంటే  ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారని అనిత  వెల్లడించారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని  చంద్రబాబు నాయుడు రీ సర్వేలో రైతుల ఇబ్బందులను  తొలగించడానికి  చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.  రైతులు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలని  ఆమె అన్నారు.  ఈ కార్యక్రమానికి ముందు  మంత్రి అనిత పురిటిపెంట గ్రామంలో వరినాట్లు పరిశీలించి రైతులతో కలిసి నాట్లు వేశారు.

పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ కావడంతో రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.  రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ స్కీమ్  అమలు దిశగా అడుగులు పడటం రైతన్నలకు ఎంతో  సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.  సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన ఈ హామీ అమలు దిశగా అడుగులు పడటం రైతులలో ఆనందానికి కారణమవుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: