
రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన మినహా మరో పార్టీ పుంజుకునే అవకాశాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల ఎంత కష్టపడుతున్నా ఆ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. షర్మిలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా, జగన్ చెల్లెలిగా ప్రజలు గుర్తిస్తున్నారు తప్ప ఆమెకంటూ సొంత ఐడెంటిటి ఇచ్చి గెలిపించే ఆలోచనల్లో మాత్రం ఏపీ ప్రజలు లేరు.
వైసీపీ గడిచిన ఏడాది కాలంలో పుంజుకున్నా జగన్ పాలనను తలచుకుని ఇప్పటికీ భయపడే వాళ్ళ సంఖ్య సైతం తక్కువేం కాదు. అభివృద్ధికి, కనీస మౌలిక సదుపాయాలకు, రోడ్ల కొరకు నామ మాత్రపు నిధులు సైతం కేటాయించకుండా కొన్ని వర్గాల ప్రజలకు జగన్ శత్రువు అయ్యాడు. జగన్ చుట్టూ ఉండే నేతలు, ఐ ప్యాక్ వల్ల ఈ నేతకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతోంది.
ఇప్పటికే చేసిన తప్పులను సరిదిద్దుకుంటే మాత్రమే జగన్ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అమరావతిని ఇతర ప్రధాన నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తే మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి లేదా గట్టి పోటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు