
ఎంపీ మిథున్ రెడ్డి అవడంతో ఆ తర్వాత జగన్ అనే చర్చ మొదలయ్యింది. ఇదివరకే బిజెపి రాష్ట్ర నేతలలో ఒకరైన ఒక నేత జగన్ జైలుకు వెళ్లడం జరుగుతుందని అంటూ భారీ ప్రకటనలు చేస్తున్నారు. అలాగే మరొకవైపు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు కూడా జగన్ జైలుకు వెళ్తారనే విషయంపై చెబుతున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద కుంభకోణం అని మాట్లాడుతున్నారని అంతేకాకుండా ప్రజల ప్రాణాలను సైతం తీసిన అతిపెద్ద స్కామ్ అంటూ చాలామంది నేతలు మాట్లాడుకుంటున్నారు.
ఈ విషయంపై వైసీపీ నేతలు మాత్రం జగన్ చుట్టూ భారీ కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. జగన్ ను జైలుకు పంపాలనే ఆలోచనతోనే ఉన్నారని.. అందుకే జగన్ తో ఉన్న నాయకులు అందరిని కూడా ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తున్నారని..జగన్ పర్యటనలకు ప్రజలలో మంచి స్పందన వస్తోందని.. పర్యటనల పట్ల ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ అరెస్ట్ అనే విషయం వినిపిస్తూ ఉన్నప్పటికీ ఎప్పుడు అనే విషయం మాత్రం చర్చనీయాంశంగానే ఉంది. అధికారులకు సరైన ఆధారాలు లభించలేదని.. ఒకవేళ ఆధారాలు దొరికితే ఎక్కువ కాలం జైల్లో ఉంచేలా గట్టి ఆధారాలతోనే కేసు నమోదు పెట్టేలా చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ జగన్ అరెస్ట్ అనే విషయం మాత్రం ఇప్పుడు రాజకీయాలలోనే ఒక ప్రకటనగా మారిపోయింది.