
పది స్థానాలకు కూటమి నుంచి పదిమంది వైయస్సార్సీపి నుంచి పదిమంది కార్పొరేటర్లు పోటీపడ్డారు. అయితే వైఎస్ఆర్సిపి 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మా రెడ్డి 50 ఓట్లతో సంఘం సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఇది అసలు జరుగుతుంది అంటూ కూటమి ప్రభుత్వం ఊహించనే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెదిరింపులతో దాదాపు 27 మంది వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లను లాక్కునేసింది అన్న మాటలు ఎక్కువగా వినిపించాయి . దీంతో జివిఎంసిలో వైఎస్ఆర్సిపి బలం 32 కు తగ్గిపోయింది అయినా సరే వైఎస్ఆర్సిపి 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి భారీ విజయం అందుకొని సంఘం సభ్యురాలుగా ఎన్నికయ్యారు.
మొత్తం 97 మంది కార్పొరేటర్ల 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు . వీరిలో 50 మంది కార్పొరేటర్లు సాడి పద్మా రెడ్డికి అనుకూలంగా ఓటేశారు. నిజానికి జీవి ఎంసీలు వైఎస్ఆర్సిపి బలం 32 కానీ అధికార కూటమికి చెందిన 18 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం ఇక్కడ హైలెట్ అయ్యే విషయం. దీంతో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలినట్టు అయింది. దీనికి ప్రధాన కారణం వైఎస్సార్సీపి నుంచి టిడిపిలోకి వచ్చిన వారిని సరిగ్గా పట్టించుకోకుండా ఉండడమే అంటున్నారు కొంతమంది రాజకీయ ప్రముఖులు. చంద్రబాబు దీనిపై స్పెషల్గా ఫోకస్ చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???