టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ జూలై 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మంచి ఓపెనింగ్లు లభించాయి. దానితో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమా కలెక్షన్లు మొదటి వీక్ డే నాడు చాలా వరకు పడిపోయాయి. దానితో ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకోవడం కాస్త కష్ట తరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్స్ వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఆరు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 11.82 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 4.19 కోట్లు , ఉత్తరాంధ్ర లో 3.29 కోట్లు , ఈస్ట్ లో 1.77 కోట్లు , వెస్ట్ లో 1.21 కోట్లు , గుంటూరు లో 1.77 కోట్లు , కృష్ణ లో 1.46 కోట్లు , నెల్లూరు లో 93 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.85 కోట్లు , ఓవర్సీస్ లో 8.95 కోట్ల కలెక్షన్లు  దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 39.24 కోట్ల షేర్ ... 74.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 52.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 53.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 14.26 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్గా నిలుస్తుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd