కొన్ని సినిమాలలో ఎక్కువగా అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ఎక్కువగా ఉండే చిత్రాలలో కొంతమంది నటీమణులు నటిస్తూ ఉంటారు. అలా మలయాళ నటి శ్వేతా మీనన్ కు ఇప్పుడు భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. కేరళలోని ఎర్నాకులం సెంటర్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ నటి శ్వేతా మీనన్ పై కేసు నమోదయ్యింది.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం 2000 లోని సెక్షన్ 67A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ఎర్నాకులం లో స్థానికంగా ఉండే మార్టన్ మోనాచేరి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది.


అయితే ఈ ఎఫ్ఐఆర్లో అనైతిక ట్రాఫిక్ 5,3 సెక్షన్లను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక లాభాల కోసం కొన్ని అస్లీల కంటెంట్, అసభ్యకరమైన ఉండే చిత్రాలలోని పాత్రలు పోషించారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే ఆ కంటెంట్ ని పాపులర్ చేసుకునేందుకు సోషల్ మీడియా అడల్ట్ వెబ్సైట్లు ద్వారా ఎక్కువగా ప్రచారం కావడంపై గడిచిన కొద్ది రోజుల క్రితం  ఎర్నాకులం వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయిస్తూ నటి శ్వేత ఇదంతా కూడా సంపాదన కోసమే చేశారన్నట్లుగా ఆరోపణలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు నటిమీద కేసు బుక్ చేశారు.


దీంతో నటి శ్వేతా మీనన్ పై వచ్చిన ఆరోపణలకు దర్యాప్తు ప్రారంభిస్తామంటూ పోలీస్ అధికారులు తెలియజేశారు. ఎలక్ట్రానిక్ రూపంలో లైంగిక అసభ్యకరమైన చర్యలు కలిగి ఉన్నటువంటి విషయాలను ప్రసారం చేయడం వంటి వాటికి (2000 లోని 67A) వర్తిస్తుంది. నటి శ్వేతా మీనన్ నటించిన బోల్డ్ కంటెంట్ విషయాలకు వస్తే.. రథినిర్వేదం, కలిమన్ను, సాల్ట్ ఎన్ పెప్పర్, పాలేరి మాణిక్యం తదితర  చిత్రాలతో పాటుగా ఒక కండోమ్ ప్రకటన కూడా  ప్రస్తావిస్తూ నటి శ్వేతా మీనన్ ఇదంతా కూడా డబ్బు కోసమే చేసిందని సోషల్ మీడియాలలో కూడా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారంటూ ఆ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ మలయాళ నటి AMMA అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ కేసు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: