కళ్యాణ్ రామ్ కొంతbకాలం క్రితం బింబిసారా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం భావించాడు. ఈ సినిమా 2022 వ సంవత్సరం ఆగస్టు 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల అయింది. ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మరి ఈ సినిమా ఆ సమయంలో ఇలాంటి కలెక్షన్లను వసూలు చేసి , ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 11.83 కలెక్షన్లను దక్కగా , సీడెడ్ ఏరియాలో 8.08 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.89 కోట్లు , ఈస్ట్ లో 2.01 కోట్లు , వెస్ట్ లో 1.50 కోట్లు , గుంటూరులో 2.28 కోట్లు , కృష్ణ లో 1.63 కోట్లు , నెల్లూరులో 96 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 33.8 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 2.34 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ఓవర్సీస్ లో 2.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 37.92 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 15.5 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 37.92 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ సినిమా 21.92 కోట్ల లాభాలను ప్రపంచ వ్యాప్తంగా అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nkr