మహేష్ బాబు
పూరి జగన్నాథ్ మధ్య ఒకప్పుడు ఎంత మంచి బాండింగ్ ఉండేదో చెప్పనక్కర్లేదు.వీరి కాంబోలో బిజినెస్ మ్యాన్,పోకిరి వంటి రెండు
ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చాయి.ఈ సినిమాలు మహేష్ బాబు కి
మాస్ అభిమానులను తెచ్చిపెట్టాయి.అయితే అలాంటి వీరిద్దరి కాంబోలో మూడో
సినిమా కూడా ప్లాన్ చేశారు. అదే జనగణమన.. మహేష్ బాబుతో ఉన్న బాండింగ్ తో
పూరి జగన్నాథ్ జనగణమన
సినిమా తీయాలి అనుకున్నారు. కానీ అదే సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అసలు కనీసం మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఇక ఆ తర్వాత
పూరి జగన్నాథ్
విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ అనే పాన్
ఇండియా మూవీ చేసిన సమయంలో
విజయ్ దేవరకొండ తో జనగణమన
సినిమా కూడా చేస్తానని ఎంతో కాన్ఫిడెన్స్ గా చెప్పారు. కానీ లైగర్
సినిమా డిజాస్టర్ అవ్వడంతో జనగణమన సినిమాని పక్కన పెట్టేశారు.
ఎందుకంటే లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ వీరి కాంబోలో
సినిమా వస్తే ప్రేక్షకుల్లో అది నెగిటివ్ ఇంప్రెషన్ నే తీసుకువెళ్తుంది.అందుకే ఈ సినిమాని ఇక్కడితో కొద్ది రోజులు వాయిదా వేసుకుంటే మంచిది అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ జనగణమన సినిమాని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం
పూరి జగన్నాథ్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో
తమిళ నటుడు
విజయ్ సేతుపతి తో కలిసి బెగ్గర్ అనే
సినిమా చేస్తున్నారు. అయితే
విజయ్ సేతుపతి యాక్టింగ్ నచ్చిన
పూరి జగన్నాథ్
విజయ్ తో బెగ్గర్
సినిమా మాత్రమే కాదు జనగణమన కూడా తీయాలని చూస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. ఇక ఈ రూమర్ కి మరింత ఊతమిచ్చేలా రీసెంట్ గా
విజయ్ సేతుపతి సార్ మేడమ్
మూవీ ప్రమోషన్స్ లో జనగణమన
సినిమా తనతోనే ఉంటుంది కావచ్చు అన్నట్లుగా మాట్లాడి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

అయితే
విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబో వస్తున్న బెగ్గర్
సినిమా హిట్ అయితే కచ్చితంగా వీరి కాంబోలోనే జనగణమన వస్తుంది అని అనడంలో ఎలాంటి అనుమానము లేదు. అయితే ఒకప్పుడు ఎంతోమంది హీరోలను స్టార్లుగా మార్చిన
పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో సినిమాలు ప్లాప్ అవ్వడంతో కాస్త ఇబ్బందులు పడుతున్నారు.ఇక
విజయ్ సేతుపతితో బెగ్గర్
సినిమా గనుక హిట్ అయితే మళ్లీ
పూరి కమ్ బ్యాక్ ఇచ్చినట్టే. కచ్చితంగా జనగణమన
సినిమా అంతకు రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు. ఒకవేళ
విజయ్ సేతుపతి జనగణమన చేస్తే కథలో కొన్ని మార్పులు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అలా మహేష్ బాబు
విజయ్ దేవరకొండ లని అనుకున్నప్పటికీ చివరిగా
విజయ్ సేతుపతితో జనగణమన చేస్తారనే టాక్ వినిపిస్తోంది.