
కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఇద్దరు హీరోలు తమ పాత్రలకు సంబంధించిన షేడ్స్ బాగా చూపిస్తున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ ఇంటి ముందు ఎన్టీఆర్ వార్నింగ్ ఇస్తున్న విధంగా ఓ బిల్ బోర్డు దర్శనమిచ్చింది . ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ ఇంటిముందు కబీర్ వార్నింగ్ ఇస్తున్నట్లు బిల్ బోర్డ్ కనిపించింది . ఇది రిటర్న్ గిఫ్ట్ గా బావిస్తున్నారు అందరు. "మీ రిటర్న్ గిఫ్ట్ అదిరింది సార్ ..అసలైన వారు ఆగస్టు 14న ఉంటుంది" అంటూ తారక్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రెసెంట్ ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్స్ కోసం ఇద్దరు స్టార్స్ బాగా కష్టపడుతున్నారు అని .. కానీ ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ సినిమా పై టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ అంచనాలు ఉన్నాయి . చూడాలి మరి ఆగస్టు 14వ తేదీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ అందుకుంటుందో..? ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..? ఫ్యాన్స్ ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా ధియేటర్ లో చూద్దామా అంటూ వెయిటింగ్..!!