ఏంటి యాంకర్ రవిపై క్షుద్ర పూజలు చేశారా.. అలాంటి పిచ్చి పని ఎవరు చేశారు.. ఇంతకీ రవి మీద క్షుద్ర పూజలు చేసే అంత పగ వాళ్లకి ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. యాంకర్ రవి ఇప్పటికే ఎన్నో షోలు చేసి సక్సెస్ఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈయన పలు ఈవెంట్లు, షోలు అంటూ బిజీ బిజీగా గడుపుతారు.తన మాటల పంచ్ లతో ఎంతోమందికి నవ్వులు తెప్పించే మాటకారి అయినటువంటి యాంకర్ రవి కేవలం యాంకర్ గానే కాకుండా హీరోగా ఓ సినిమా కూడా చేశారు.ఈ సినిమా పేరు తెచ్చి పెట్టడమే కాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే అలాంటి యాంకర్ రవి మీద ఓ యాంకర్ కావాలనే క్షుద్ర పూజలు చేయించిందట.మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

యాంకర్ రవి తాజాగా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఉండే ఓ యాంకర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి నామీద చేతబడి వంటి పూజలు చేయించారు.నా నాశనం కోరే నామీద క్షుద్ర పూజలు చేయించారు. అయితే ఈ విషయం నాకు రీసెంట్గా తెలిసింది.కానీ వాళ్ళు ఎవరు నా నాశనం కోరుకున్నా కూడా నాకు ఏమీ కాదు. ఎందుకంటే నేను వాటికి భయపడను. కాబట్టి వాటిని అంతగా పట్టించుకోలేదు కూడా. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా యాంకర్ లాస్యతో ఉన్న గొడవల గురించి మాట్లాడుతూ.. నాకు లాస్యకు మధ్య సంథింగ్ స్పెషల్  షో చేసే టైంలో కొన్ని గొడవలు వచ్చాయి.

అవి చిన్న పిల్లలు పెట్టుకునే గొడవలే. ఆ తర్వాత ఇద్దరం కలిసిపోయాం. మా ఇద్దరిని స్టార్ మా ఎన్నో షోలకు పిలిచింది. అలా మేమిద్దరం కలిసి ఎన్నో షోలు కూడా చేశాం.మా ఇద్దరి మధ్య ప్రస్తుతం ఎలాంటి విభేదాలు లేవు అంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చారు.అయితే ఇదంతా బాగానే ఉంది కానీ రవిపై క్షుద్ర పూజలు చేసిన ఆ యాంకర్ ఎవరు..లేడీ యాంకరా లేక మేల్ యాంకరా..ఎందుకు రవి మీద క్షుద్ర పూజలు చేయించారు.. ఆయన ఇండస్ట్రీలో రాణించకూడదనే కక్ష్య కట్టే అలా చేయించారా.. ఇక ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్న స్వామీజీ అంటే కచ్చితంగా వేణు స్వామియే..అంటే వేణు స్వామి తోనే పూజలు చేయించారా అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే యాంకర్ అని చెప్పాడు కానీ వాళ్ల పేరు మాత్రం రవి రివీల్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: