
ఇక మహిళలు సైతం బస్సు ఎక్కుతం డబ్బులు కట్టక్కర్లేదు.. అది సిటీ బస్సు, మెట్రో బస్సు, అలాగే ఎక్స్ప్రెస్ బస్సు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఈ బస్సులలో మహిళలు సంతోషంగా ఎక్కుతూ తిరుగుతూ ఉన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన మాట విషయంలో నిలబెట్టుకున్నారు. వాస్తవంగా వైసిపి పార్టీ ఒక ఆరోపణ చేస్తోంది.. రాష్ట్రమంతా కూడా ఇక ఎక్కడైనా తిరగవచ్చు అని.. కానీ అప్పుడే ఎలక్షన్స్ సమయంలో పల్లె వెలుగని చెప్పారు, జిల్లాలలో అని కూడా చెప్పారు కూటమి.
అయితే ఒక రకంగా చెప్పాలి అంటే పల్లె వెలుగుతో పాటు సిటీ బస్సులతోపాటు, ఎక్స్ప్రెస్లను కూడా అనుమతించారు. వాస్తవంగా చెప్పిన దానికంటే మరింత ఎక్కువ కల్పిస్తు రాష్ట్రమంతా బస్సులు తిరిగేలా చేసింది కూటమి ప్రభుత్వం. బస్సులు మాత్రం కొంత మెరకు తక్కువగా ఉన్నప్పటికీ.. కొత్త బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే ఫ్రీ బస్సులను ప్రారంభించారు.. అలాగే ఆటో డ్రైవర్ల సమస్యను కూడా గుర్తుపెట్టుకుని మరి మాట్లాడడం జరిగింది. త్వరలో వారి యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తామంటూ కూటమి ప్రభుత్వం తెలిపింది.గతంలో జగన్ 10,000 ఇస్తే చంద్రబాబు 20,000 ఇస్తానని చెప్పారు. మరి వాటినేమన్న లైన్ లోకి తీసుకొస్తారేమో చూడాలి.