కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ బయటపడిందని చాలామంది వైసిపి నేతలు మాట్లాడుతున్నారు.. గతంలో వైసిపి పార్టీ రౌడీయిజం అంటూ ఒంటికాలిపై లేచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పాలనలో ఇదే జరుగుతున్న సైలెంట్గా వ్యవహరిస్తున్నారని.. కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ చేస్తున్న పనిని చూసి చాలామంది ప్రజలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇటీవలే టిడిపి సీనియర్ నేత బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బంది పైన దారుణంగా దాడి చేసినట్లుగా వీడియోలు ఫోటోలు వైరల్ గా మారాయి.
అటవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరి చిత్రహింసలు పెట్టారనే విమర్శలు శ్రీశైలం ఎమ్మెల్యే పైన వినిపిస్తూ ఉన్నాయి. అటవీ శాఖ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నప్పటికీ తన శాఖకి చెందిన ఉద్యోగుల పైన ఇలాంటి అత్యంత అమానుషంగా దాడి చేయడం ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం చాలా హాట్ టాపిక్ గా మారుతున్నది. రాయలసీమలోని ఒక సీనియర్ నేత కూడా పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న అభివృద్ధి చేయడం పై ఎలాంటి స్పందన లేదంటు మాట్లాడారు. గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసు మొదట బాధ్యత తీసుకుంటానని బాదిత కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ విషయంపైనే స్పందించలేదు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పవర్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారని వాదన వినిపించేలా చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి