భారతదేశంలో కొన్ని కులాల వారికి రిజర్వేషన్లు ఉంటే వారు ఎంతో అభివృద్ధి చెందుతారు. దేశం లోని అన్ని వర్గాల వారు సమాన స్థాయికి చేరుతారు. అనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు దేశంలో 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలి అని ఒక ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఇక ఆ తర్వాత 10 సంవత్సరాల్లో వారు ఏమీ అభివృద్ధి చెందలేదు అని అలా పది , పది పెంచుకుంటూ ఇప్పటికే స్వతంత్రం వచ్చాక చాలా సంవత్సరాల పాటు రిజర్వేషన్లను పెంచుతూ పోయారు. ఇక కొంత మంది తమ స్వలాభం కోసం , అధికారం లోకి రావడం కోసం రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్లు అస్సలు దాటకూడదు అని అనేక సందర్భాలలో చెప్పింది. అయినా కూడా కొంత మంది పట్టించుకోకుండా ఏడా పేడ వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక రాష్ట్రంలో ఏకంగా మేము అధికారం లోకి వస్తే 85 శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని ప్రకటించారు. దీనితో ఈ ప్రకటన సంచలనాత్మకంగా మారింది. అసలు అది ఏ రాష్ట్రంలో జరిగింది ..? ఎవరు ఈ హామీ ఇచ్చారు ..? అనే వివరాలను తెలుసుకుందాం.

తాజాగా బీహార్ లో అధికారం లోకి రావడం కోసం పప్పు ఖాన్ గారి గురువు అయినటువంటి తేజస్వి యాదవ్ గారు మేము అధికారం లోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో 85 శాతం రిజర్వేషాలు ఇస్తాము అని ప్రకటించారు. ఇలా వేరు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 85 శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని ప్రకటించడంతో ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలా మేము అధికారంలోకి వస్తే 85 శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని వారు ప్రకటించడం పై అనేక మంది అనేక రకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: