తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేస్తోంది కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించేలా కేసీఆర్ ఎంతో కృషి చేశారు. 9 సంవత్సరాల పాలనలో ఆయన ఎదురులేని మనిషిలా పాలన అందించారు. కేసీఆర్ ను కనీసం పళ్ళెత్తి మాట అనేవారు లేకుండా ఉండేవారు. అలాంటి ఆయన కుటుంబాన్ని ఆయనను  తన సొంత కూతురే రోడ్డుపైకి లాగింది.. చివరికి సెంటిమెంటు రాజేస్తూ కుటుంబ మద్దతు పొందాలని ప్రయత్నిస్తోంది. కానీ కేసీఆర్ దీనిపై కఠిన నిర్ణయం తీసుకొని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కవిత దారి అంధకారంగా మారింది..మరి కవితకి ఎవరైనా మద్దతిస్తున్నారా ఆ వివరాలు చూద్దాం.. నిజానికి కవిత ఏదో సెంటిమెంటు పండించి తన నాన్నకు దగ్గరవుదామని చూసింది. కానీ చివరికి తానే ఒంటరి అవుతుందని అనుకోలేదు. కనీసం ఏ పార్టీ వాళ్లు కూడా సపోర్ట్ చేయడం లేదు. 

చివరికి బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కూడా మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంటూ మాట్లాడుతున్నారు. అంతే కాదు తన సొంత అన్న కేటీఆర్ కూడా కవిత వ్యాఖ్యలు అస్సలు పట్టించుకోలేదు. రామన్న ఇంట్లో ఇంత అన్యాయం జరిగితే పట్టించుకోకుంటే ఎలా, హరీష్ రావు సంతోష్ రావు నాన్నని మోసం చేస్తున్నారు. చివరికి నిన్ను కూడా మోసం చేస్తారని మాట్లాడుతూ వచ్చింది. ఆమె ఇన్ని మాట్లాడిన  కేటీఆర్ మాత్రం అసలు కవిత ఎవరో నాకు తెలియదు అన్నట్టే ప్రవర్తించారు. ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొని రేవంత్ మీద సిబిఐ దర్యాప్తు పైన మాట్లాడుతూ వచ్చారు. వీరిని పక్కన పెడితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఇష్యూ పై స్పందించారు. అసలు కేసీఆర్ కుటుంబం అంతా డ్రామా ఆడుతోంది.

అసలు సిబిఐ ఎంక్వయిరీలో నిజాలు బయటపడుతున్నాయని తెలిసి ఈ విధంగా దాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామా మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా వారి అవినీతి సాక్ష్యాదారాలు బయట పడుతున్నాయని,దాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. అలాగే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్లది వాళ్లు కొట్టుకొని చస్తుంటే వాళ్ళ ఇండ్లలో మేము గొడవలు పెడుతున్నామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విధంగా కవితకి ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీల వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా కనీసం సపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఈ విధంగా కవిత పూర్తిగా ఒంటరిది అయిపోయిందని అర్థమవుతుంది. మరి చూడాలి ఈమె చివరికి ఏ దారి వెంట వెళ్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: