జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎన్టీఆర్ ప్రతి సినిమాకి కూడా అభిమానులు తనని ఎలా చూడాలనుకుంటారో అలా మారుతూ ఉంటారు. అందుకే ఎన్టీఆర్ కష్టానికి తగ్గట్టుగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇటీవలే ఎన్టీఆర్ బాలీవుడ్లో నటించిన వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగానే జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని ఎంపిక చేశారు. వచ్చేయేడాదికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.



తాజాగా ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం జిమ్ములో కష్టపడుతున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్  డ్రాగన్ సినిమా కోసం కాస్త సన్నబడినట్లుగా కనిపిస్తోంది. అలాగే కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా లీక్ అయిన ఈ వీడియో అభిమానులు చూసి  డ్రాగన్ సినిమాలో కూడా షర్ట్ లెస్ సీన్ ప్లాన్ చేశారా అంటు ఆశ్చర్యపోతున్నారు. కేవలం ఈ ఒక్క వీడియోతో అటు ఎన్టీఆర్ బాడీ లుక్స్ తో పాటు డ్రాగన్ చిత్రం పైన మరింత అంచనాలను పెంచేసేలా కనిపిస్తున్నాయి.


వార్ 2 ఫలితం వల్ల జూనియర్ ఎన్టీఆర్ కథల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డ్రాగన్ సినిమాకి సంబంధించి కథలలో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేర్చినట్లుగా వినిపించాయి. మరి డ్రాగన్ సినిమాతో ఏ విధమైనటువంటి సక్సెస్ తో అభిమానులను ఖుషీ చేయాలని చేస్తున్నారు ఎన్టీఆర్.2024 లో విడుదలైన దేవర మొదటి భాగానికి సీక్వెల్ గా ఉంటుందంటూ చిత్ర బృంద గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించి ఎలాంటి పనులు జరగకపోవడంతో సీక్వెల్  ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: