మన దేశంలో ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను వినియోగిస్తారనే సంగతి తెలిసిందే.  పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా  ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈవీఎంలపై ఎక్కువ సంఖ్యలో ఆరోపణలు  వస్తుండటం గమనార్హం.  అయితే ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగే అవకాశం అస్సలు ఉండదని పలు సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పుకొచ్చింది.

అయితే బీహార్ ఎన్నికల నుంచి ఎన్నికల కమిషన్ కొత్త నిబంధనలు అమలు చేస్తుండటం గమనార్హం.  ఇకపై ఈవీఎంలపై  గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఏర్పాటు చేయనున్నారు.  ఈవీఎంలపై 20 ఎం.ఎం సైజులో కలర్ ఫోటోతో పాటు  40 ఎం.ఎం సైజులో పార్టీ సింబల్ ను ఉంచనున్నారు.  బీహార్ ఎలక్షన్స్ నుంచి ఎన్నికల కమిషన్  ఈ ప్రక్రియను మొదలుపెట్టనుంది.

దేశవ్యాప్తంగా పలు లోక్ సభ నియోజకవర్గాలలో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటు హక్కును అపహరించారనే రాహుల్ గాంధీ ఆరోపణలను జ్ఞానే శ్రీకుమార్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.  రాహుల్ గాంధీ ఆరోపణల ప్రకారం ఓటు చోరీ గురించి ఏడు  రోజులలో సమగ్ర అఫిడవిట్ ను సమర్పించాలని అలా చేయని పక్షంలో దేశ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఈసీ వెల్లడించింది.

బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా అక్కడ చేపట్టిన జాబితా సమగ్ర సవరణ  అత్యంత పారదర్శకంగా జరుగుతోందని సీఈసీ తెలిపింది. అయితే విపక్షాలు మాత్రం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.  కొంతమందికి  రెండు నివాసాలు ఉండవచ్చని అందువల్ల రెండు గుర్తింపు కార్డులు ఉండవచ్చని ఈ సందర్భంగా సీఈసీ తెలిపింది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: