
టాలీవుడ్ హీరో నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దాదాపుగా పాతికేళ్ల సినీ కెరీర్ లో నితిన్ సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక సూపర్ హిట్ సాధించిన తర్వాత వరుస ఫ్లాపులు నితిన్ కెరీర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. వినాయక్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించినా నితిన్ ఒక స్థాయికి మించి కెరీర్ పరంగా ఎదగలేదు.
అయితే కాంబినేషన్లను నమ్ముకుని ముందుకెళ్లడం నితిన్ కెరీర్ పాలిట శాపంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో ఇతర సినిమాలతో పోటీ కూడా నితిన్ కెరీర్ ను ఊహించని స్థాయిలో దెబ్బ కొట్టింది. ఈ ఏడాది రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో నితిన్ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మరొకటి డిజాస్టర్ గా నిలిచాయి. తమ్ముడు సినిమా కథ, కథనం విషయంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.
టాలీవుడ్ టాప్ బ్యానర్లలో, హిట్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించినా నితిన్ కోరుకున్న విజయాలు మాత్రం దక్కలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నితిన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది. నితిన్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నా అందుకు భిన్నంగా జరుగుతోంది. నితిన్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోందని ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి.
అయితే ఫ్యాన్స్ నుంచి విపరీతమైన నెగిటివిటీ రావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోయింది. నితిన్ కొత్త దర్శకుడి డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. తమ్ముడు సినిమా నష్టాల వల్ల నితిన్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందని తెలుస్తోంది. నితిన్ లుక్స్ విషయంలో సైతం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నితిన్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.