ఆసియా కప్ 2025 లీగ్ మ్యాచ్ ఇటీవలే టీమిండియా దెబ్బకు పాకిస్థాన్ చాలా ఘోరంగా ఓడిపోయింది.. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ,ఇండియన్ బౌలర్ల దాటికి తలవంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ తో కూడా సమాధానం చెప్పిన భారత్.. కేవలం 15 .5 ఓవర్ల కే లక్ష్యాన్ని చేదించి విజయాన్ని అందుకున్నారు. మ్యాచ్ మొత్తంలో పాకిస్తాన్ జట్టు ఏ విభాగంలో కూడా ఇండియాకి పోటీ ఇవ్వలేదక పోయింది.. మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ జట్టు పైన పలు వ్యాఖ్యలు చేశారు.


పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇండియాను ఓడించే సీన్ లేదని తేల్చి చెప్పేశారు.. భారత దేశవాళి జట్టు కూడా పాకిస్తాన్ ని ఓడించగలదంటూ విమర్శించారు. ఇండియన్ డొమెస్టిక్ లో రాణిస్తున్న ముంబై, పంజాబ్ వంటి జట్లు కూడా పాకిస్తాన్ని ఓడించేస్తాయంటూ  పఠాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఇందుకు సంబంధించి సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో మాజీ క్రికెటర్ పఠాన్  ఈ విధంగా మాట్లాడారు.


అలాగే ముంబై మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ కూడా మాట్లాడుతూ.. పఠాన్ వ్యాఖ్యలకు తాను ఏకీభవిస్తున్నానంటూ తెలిపారు. మేము ఆటను ఎలా నిర్మించాలో ఆలోచిస్తాము.. పాకిస్తాన్ కేవలం స్పిన్నర్లతోనే వచ్చింది, ఫాస్ట్ బౌలర్ లేరు.. కానీ వారి బౌలింగ్ కూడా భిన్నంగానే ఉన్నది. ఆట ప్రారంభం నుంచి చివరి వరకు ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ,ఇండియన్ క్రికెట్ టీముకు ఏ విధమైనటువంటి పోటీ ఇవ్వలేకపోయిందని తెలిపారు. ఇక ఇండియా జట్టు ఏదో జట్టు మీద ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా కనిపించిందని మాజీ క్రికెటర్ అభిషేక్ మాట్లాడారు. ఇండియన్ టీమ్ రెండు విజయాలతో సూపర్ -4 కి అర్హత సాధించిందని తెలిపారు. మొత్తానికి పాకిస్తాన్, ఇండియా చేతిలో  ఘోరంగా ఓడిపోవడంతో ఇండియన్స్ కి ఇది కొంతమేరకు ఆనందాన్ని కలిగిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: