తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్, మిరాయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచి కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేసిన సంగతి తెలిసిందే. హనుమాన్, మిరాయ్ సక్సెస్ తో  రాబోయే రోజుల్లో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యకమవుతున్నాయి. హనుమాన్, మిరాయ్ సినిమాలు టాలీవుడ్ నిర్మాతల్లో కొత్త కాన్ఫిడెన్స్ ను ఇచ్చాయి.

నిర్మాత నాగవంశీ సైతం వాయుపుత్ర సినిమాతో  ప్రేక్షకుల ముందుకు విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్నారు.  టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం హనుమాన్, మిరాయ్ తరహా స్క్రిప్ట్స్ కావాలని కోరుతున్నారని  తెలుస్తోంది. మైథలాజికల్ టచ్ సినిమాలను సైతం తక్కువ బడ్జెట్ తోనే  తెరకెక్కించవచ్చని ఈ రెండు సినిమాల సక్సెస్ తో ప్రూవ్ అయిందనే సంగతి తెలిసిందే. ఇకపై అలాంటి సినిమాలే తెరకెక్కుతాయా?  అనే ప్రశ్నకు అవుననే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఈ తరహా సినిమాలు కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తున్నాయి. మిరాయ్ సినిమా ఇప్పటికే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.  ఈ సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటుఇటుగా షేర్ కలెక్షన్లు వచ్చాయి.

నైజాంలో ఈ సినిమా ఇప్పటికే 15 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిందని సమాచారం అందుతోంది.  మిరాయ్  మూవీ సక్సెస్ తో తేజ సజ్జా పారితోషికం పెరిగిందని తెలుస్తోంది.  తేజ సజ్జా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ  పెరుగుతున్నాయి.   భవిష్యత్తులో తేజ సజ్జా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు చేస్తాయేమో చూడాల్సి ఉంది.  చిరంజీవి చెప్పిన సలహా తన కెరీర్ కు  ఎంతగానో ప్లస్ అయిందని తేజ సజ్జా పలు సందర్భాల్లో వెల్లడించారు. తేజ సజ్జా రాబోయే రోజుల్లో 10 కోట్ల రూపాయల  రేంజ్ లో పారితోషికం అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: