
తాజాగా షర్మిల కర్నూలు జిల్లా పర్యటనలో రాజా రెడ్డి విషయాన్ని ప్రకటించారు. అయితే ఆమె పక్కా వ్యూహంతోనే ఇలా అనౌన్స్ చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మూడున్నర సంవత్సరాల సమయం ఉంది. ఈ సమయంలో కుమారుడు రాజా రెడ్డిని ఆక్టివ్ చేయడమే ఆమె ప్రధాన లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తుంది. రాజకీయాల్లో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా మలచడమే వైఎస్ షర్మిల మెయిన్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, వైఎస్ రాజా రెడ్డి కూడా బాగా చదువుకున్న వ్యక్తి. సమాజానికి అవసరమైన టాలెంట్ ఉన్న పొలిటిషియన్ అవుతాడు ఇతడు అని అందరూ చెబుతున్నారు.
అలాంటి రాజా రెడ్డి స్పీచ్ ఇచ్చి జనాలను ఆకట్టుకున్నాడంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి కచ్చితంగా భారీ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి - వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినా, ఇక్కడ వైఎస్ రాజా రెడ్డి అని పేరు పెట్టుకుని, జగన్ కన్నా మించిపోయే రేంజ్‌లో జనాలను ఆకట్టుకునే సత్తా ఉన్న వాడిగా షర్మిల కొడుకును జనాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజా రెడ్డి కూడా పలువురు పొలిటిషియన్లతో మాట్లాడి, భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై సీరియస్‌గా చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ మామకు రాజా రెడ్డి అల్లుడు దెబ్బ గట్టిగానే తగలబోతుందంటూ మీమర్స్, ట్రోలర్స్ ఘాటుగా ఆడేసుకుంటున్నారు..!!