
ఈ కమిటీ ఆమోదం తర్వాత, దస్త్రం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య కమిటీకి, ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్‌కు చేరి బడ్జెట్ ఆమోదం పొందుతుంది. చంద్రబాబు నాయుడు భవిష్యత్ విస్తరణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించి, 140 మీటర్ల వెడల్పుతో ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం పొందారు. భూసేకరణకు రూ.5,600 కోట్లు కేటాయించగా, రాష్ట్రం రూ.1,000 కోట్లు భరించనుంది.
నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ, మైనింగ్ సీనరేజ్ ఫీజులను మినహాయించి రాష్ట్రం రూ.2,000 కోట్ల భారాన్ని సమర్థిస్తోంది.భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లకు సూచించారు. పల్నాడు జిల్లా నుంచి పూర్తి వివరాలు అందగా, ఏలూరులో మార్పులు సూచించారు. మిగిలిన జిల్లాల నుంచి రెండు వారాల్లో వివరాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టు దేశంలో అత్యంత విస్తృతమైన ఔటర్ రింగ్ రోడ్‌గా నిలవనుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు