- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవ‌ల ఒక కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీ అధినేత జ‌గ‌న్ భార్య‌ వైఎస్ భారతి పాత్ర గురించి చాలా వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నేరుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరని అనిపించినా, వాస్తవానికి పార్టీ వ్యవహారాల్లో ఆమె ప్రభావం ఎప్పటినుంచో కొనసాగుతోందన్న‌ది నిజం. మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతి ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగిపోయింది. జగన్ తీసుకునే నిర్ణయాలపై భారతి ప్రభావం ఉంటుందని, ఆమె రిమోట్ కంట్రోల్ లా వ్యవహరిస్తారని కూడా చాలామంది స్పష్టంగా చెబుతుంటారు. జగన్ సోదరి షర్మిలా కూడా ఈ విషయాన్ని అనేకసార్లు బహిరంగంగా ఆరోపించారు.


ఒకప్పుడు విజయసాయిరెడ్డి వంటి కీలక నాయకులు జగన్‌తో పాటు నేరుగా భారతి పేరును ప్రస్తావించి కృతజ్ఞతలు తెలపడం కూడా ఆమె ప్రాముఖ్యతను చూపించింది. పదవులు ఎవరికివ్వాలి, పార్టీ నిర్ణయాలు ఎలా ఉండాలి అన్నది కుటుంబం నిర్ణయించేదని అప్పట్లోనే టాక్ ఉంది. ఇక ధనుంజయ్ రెడ్డి వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. చాలా మంది నాయకుల అభిప్రాయం ప్రకారం ఆయన నిర్ణ‌యాల వ‌ల్లే పార్టీ పలు ఇబ్బందులు ఎదుర్కొందని, కొన్ని ఓటములు ఎదుర్కొంద‌ని అంటున్నారు. అయితే ధనుంజయ్‌కు ఆ స్థాయి ప్రాధాన్యం రావడానికి కారణం భారతే అని లోపల చాలా మంది చెబుతున్నారు. ఆయనను సీఎంవో నుంచి పార్టీ వరకూ ప్రతినిధిగా ముందుకు నెట్టింది భారతి అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం జగన్ ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యల నేపథ్యంలో, భవిష్యత్తులో ఆయన జైలుకెళ్లే అవకాశం ఉందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాంటి పరిస్థితి వస్తే పార్టీని నేరుగా భారతి నడిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె కంట్రోల్‌లో వ్యవస్థ కొనసాగుతోందని, ఇప్పుడు కొత్తగా జోక్యం చేసుకుంటున్నారని చెప్పడం అవగాహన లేకపోవడమేనని అంటున్నారు. మొత్తానికి, వైసీపీ భవిష్యత్తు దిశలో భారతి పాత్ర మరింత కీలకం కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: