జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి  నోటిఫికేషన్ జారీ చేశారు ఎన్నికల అధికారులు. అయితే  ఈ ఎన్నికల్లో టిడిపి,కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ లు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ టిడిపికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని చాలామంది భావించారు. ఎందుకంటే టిడిపి కేంద్ర సర్కారుకు సపోర్ట్ చేస్తూ వస్తోంది. మొన్నటి వరకు టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. ఇంతలోనే సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్ గీశాడు.. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు తన మైండ్ తో టిడిపిని కూడా పోటీకి రాకుండా చేశారని చెప్పవచ్చు. 

ఆయన ఏం ప్లాన్ వేశారో  ఇప్పుడు చూద్దాం.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రేవంత్ గెలవడం కోసం గత ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేసిందని అంటారు. 2023 ఎన్నికల్లో టిడిపికి చెందిన చాలామంది నాయకులు, ఓటర్లు కాంగ్రెస్ జెండా పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా రేవంత్ ఆ ఆస్త్రాన్ని వాడుకుంటూ వస్తున్నారు. నేను తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయదని పరోక్షంగా చెప్పేశారు. ఈ విధంగా మరో వైపు సీక్రెట్ గా ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఇలా టిడిపి ఓవైసీ ఓట్లు కూడా కాంగ్రెస్ కే పడేటట్టు ప్లాన్ గీశారు.

ఇదే తరుణంలో టిడిపి కూడా ఇక్కడ పోటీకి దూరమైనట్టు తెలుస్తోంది. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ లో బిజెపితో పొత్తు పెట్టుకున్నటువంటి టిడిపి తెలంగాణకు వచ్చేసరికి తన పంథాను మార్చుకుంటుంది. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించారు. అయితే బిజెపి పార్టీ ముస్లింలకు అసలే టికెట్ ఇవ్వదు. ఇదే తరుణంలో కవిత ప్రకటించిన పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తుందని కాంగ్రెస్ కూడా వెయిట్ చేస్తుంది. ఒకవేళ ముస్లింకు సంబంధించి కవిత టికెట్ ఇస్తే, కాంగ్రెస్ కూడా ముస్లిం అభ్యర్థిని పోటీ చేయించాలని   భావిస్తోంది. అయితే ఇప్పటికే ప్లాన్ ఏ, ప్లాన్ బి తయారు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టిన గెలుపు వచ్చే విధంగా అన్ని ప్లాన్లు గీసి పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన ప్లాన్ లో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ పోటీ చేయడానికి నో చెప్పిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: