సోషల్ మీడియా యుగం ప్రస్తుతం ఎక్కువగా నడుస్తోంది దీంతో సెలబ్రిటీలైన, రాజకీయ నాయకులైన సరే ఎలాంటి పని చేసిన క్షణాలలో వైరల్ గా మారిపోతోంది. తాజాగా ఇప్పుడు ఒక దేశానికి మాజీ ప్రధాని అయ్యుండి ఒక పాప్ సింగర్ తో డేటింగ్ చేస్తూ బిజీగా తన సమయాన్ని గడిపేస్తున్నారు. అది కూడా సముద్రపు మధ్యలో పడవలో ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ ఫోటోలు సంచలనంగా మారుతున్నాయి.


అసలు విషయంలోకి వెళ్తే పాప్ సింగర్ కేటీ పెర్రి, కెనడా మాజీ ప్రధాని జస్టిస్ ట్రూడో ఇద్దరు కూడా సముద్రపు మధ్యలో ఒక పడవల రొమాన్స్ చేస్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. వీరిద్దరూ కాలిఫోర్నియాలోని శాంటా బార్బారా తీర ప్రాంతంలో ఉన్నప్పుడు ఫోటోలు అన్నట్లుగా వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాప్ సింగర్ కేటీ పెర్రి తన భర్తకు గతంలో విడాకులు ఇచ్చింది, అలాగే కెనడా మాజీ ప్రధాని తన భార్య సోఫీ గ్రెగోయిర్ తో విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నారు.


ఇలాంటి సమయంలోనే కేటి ఫెర్రీ, జస్టిస్ ట్రూడో మధ్య రిలేషన్ కి దారితీసిందననే గుసగుసలు వినిపిస్తున్నాయి. పాప్ సింగర్ కేటి పెర్రి ,జూన్ 2025 లో తన భర్త ఓర్లాండో బ్లూమ్ కు విడాకులు ఇవ్వగా వీరికి ఒక పాప కూడా ఉన్నది. ఇక కెనడా మాజీ ప్రధాని తన భార్యతో 2023లో విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కలరు. సోషల్ మీడియాలో కెనడా మాజీ ప్రధాని, గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు వైరల్ గా మారడంతో  నేటిజన్స్ సైతం మాజీ ప్రధాని మన్మధుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరి ప్రేమను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: