ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ మరి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు సీఎం చంద్రబాబు. ఈ సమయంలోనే రాష్ట్రంలో కౌలు రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉండే కౌలు రైతులకు యూనిక్ నెంబర్ ను అమలు చేసేలా ఉత్తర్లను జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నహాలు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. దీని ద్వారా భూములున్న రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా వివిధ పథకాలలో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.


ఇప్పుడు కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కౌలు రైతుల పాలిట గొప్ప వరంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు భూములు ఉన్న రైతులకే కేంద్ర ప్రభుత్వం ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ని ఇస్తోంది. అలాగే వీటికి తోడు వెబ్ ల్యాండ్  ఆధారంగా రైతుల భూముల వివరాలను కూడా ఇందుకు అనుసంధానం చేస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా ఆదేశాలతో వ్యవసాయ శాఖ ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ.. మొదటిసారి ఏపీలో కౌలు రైతులకు సంబంధించి విధానాలను రూపొందించబోతున్నట్లు తెలియజేశారు. దీని ద్వారా కౌలు రైతులలో కూడా భూములు ఉన్న వారితో సమానంగా అన్ని ప్రయోజనాలను ,సంక్షేమ పథకాలను పొందుతారు అంటూ తెలియజేశారు. అలాగే కౌలు రైతు కార్డు ఉన్నవారు.. CCRC రైతులు గడువులో ఈ పంటలు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. దీనివల్ల అని లాభాలను పొందుతారని తెలిపారు.  రైతు నేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా  ఈ పురస్కారాలను ఈ నెల 26వ తేదీన రంగారెడ్డి జిల్లాలో స్వర్ణ భారత్ ట్రస్టులో భాగంగా ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐవి.సుబ్బారావు. కౌలు రైతులకు సంబంధించి మరి పూర్తి వివరాలను ఏపీ ప్రభుత్వం అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: