మంగళవారం ఉదయానికి దీని తీవ్రత తుఫానుగా మారే అవకాశం ఎక్కువగా ఉన్నదంటు విశాఖ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల వరకు ప్రభావం ఉంటుందని అలాగే కాకినాడ ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల వరకు, చెన్నైకి తూర్పు ఆగ్నేయం 600 కిలోమీటర్ల వరకు ఈ తుఫాను ప్రభావం కేంద్రీకృతమై ఉంటుందంటూ వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఈ తుఫాను 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీచే అవకాశం ఉన్నదట. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం రోజున తీరం దాటే అవకాశం ఉన్నది.
తుఫాను తీరం దాటే సమయానికి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మొంథా తుఫాను దూసుకొస్తున్న తరుణంలో ముందస్తు చర్యల కింద అధికారులకు సెలవులను రద్దు చేసి ,మరి సహాయక చర్యల కోసం రూ . 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేసింది. 16 శాటిలైట్ ఫోన్లు, 57 తీర ప్రాంతాలలో 219 తుఫాన్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేసింది. అలాగే సముద్రంలోని 62 మేకనైజ్డ్ ఒడ్డుకు రప్పించేలా చేశారు. సముద్ర తీరంలో పర్యటకుల రాకపోకలను కూడా నిషేధించారు.
అనకాపల్లి, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్ వంటి జిల్లాలలో విద్యాసంస్థలు రోజులపాటు సెలవులను ప్రకటించారు. అలాగే ఏలూరు, కడప, పశ్చిమగోదావరి, బాపట్ల వంటి ప్రాంతాలలో రేపటి వరకు విద్యాసంస్థలు సెలవుగా ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఒక్కరోజు సెలవుగా ప్రకటించారు. అన్ని జిల్లాలలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ఏపీ ప్రభుత్వం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి