 
                                
                                
                                
                            
                        
                        భక్తుల భక్తి, విశ్వాసాలపై మచ్చ గుర్తు చేసిన ఈ కుట్ర రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.సిట్ దర్యాప్తులో తేలిన వివరాలు ఆశ్చర్యకరం. 2022లో అప్పన్న టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌ను సంప్రదించి నెయ్యి సరఫరా కంపెనీల వివరాలు సేకరించాడు. భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ డిమాండ్ చేశాడు. కమీషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో కుట్ర ప్రారంభమైంది. భోలేబాబా డెయిరీపై అనర్హత వేటు వేయడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చాడు.
అజ్ఞాత వ్యక్తుల ద్వారా పిటిషన్లు దాఖలు చేయించి తనిఖీలు చేయించాడు. ఫలితంగా భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణ నిలిచిపోయింది. ఈ కుట్రలో అప్పన్న పాత్ర ముఖ్యమని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.భోలేబాబా డెయిరీ అనర్హత తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థకు మార్గం సుగమమైంది. ఈ సంస్థ భోలేబాబా కంటే కిలోకు రూ.138 ఎక్కువ కోట్ చేసింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి