ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాశిబుగ్గ ఘటన సంచలనం రేపుతోంది. హరి ముకుంద్ అనే వ్యక్తి తిరుమల శ్రీవారిని దర్శించడానికి వెళ్లి భక్తుల రద్దీ వల్ల అతన్ని పక్కకు నెట్టేశారు. దీంతో హర్ట్ అయినటువంటి ముకుంద  తన దగ్గర ఉన్న పొలంలో దాదాపు 12 ఎకరాలను కేటాయించి,  తిరుమల శ్రీవారిని పోలిన ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ ఆలయం నిర్మాణ దశలోనే ఉంది. అయితే ఏకాదశి సందర్భంగా భక్తులు అక్కడికి చేరుకొని దర్శనం చేసుకోవాలనుకున్నారు. కానీ అనుకోకుండా శనివారం వేలాదిమంది భక్తులు అక్కడికి వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి దాదాపు 9 మంది మరణించి మరికొంతమందికి గాయాలయ్యాయి. మరి ఈ ఘటనకు కారకులు ఎవరు.. దీనిపై నిర్లక్ష్యం వహించింది ఎవరు.. తొక్కిసలాట  బాధ్యత ఎవరిది అనేది చూద్దాం.. కాశిబుగ్గ ఆలయ ఘటనపై ప్రభుత్వం స్పందించి అది దేవాదాయ శాఖ కిందికి వచ్చింది కాదు ప్రైవేట్ ఆలయం అంటూ చెప్పుకోస్తోంది. 

దేవదాయ శాఖ కింద వచ్చిన ఆలయం అయితే ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదని సెక్యూరిటీ ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ ఇదివరకు ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆలయాల్లో కూడా తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయారు.. మరి ప్రభుత్వం అప్పుడు ఇలా మాట్లాడలేదే.. ఏది ఏమైనా ఈ తప్పు అనేది సమిష్టిగా తీసుకోవచ్చు. ఇందులో ప్రైవేట్ ఆలయ వ్యక్తి తప్పే కాకుండా ప్రభుత్వం, పోలీసులు,రెవెన్యూ అందరి తప్పు ఉంది.. కానీ సర్కార్ మాకు సమాచారం ఇవ్వలేదు.. అందుకే మేము అక్కడికి వెళ్లి లేదని సర్కారు చెబుతోంది. వాస్తవానికి కాశీబుగ్గ ప్రాంతంలో ఒక గుడి ఉందని తప్పనిసరిగా ఇంటిలిజెన్స్ వాళ్ళు గమనించాలి. వందమంది భక్తులు ఒక గుడికి వెళ్తున్నారు అంటే తప్పనిసరిగా అక్కడికి పోలీసులు చేరుకోవాలి.

రెవెన్యూ అధికారులు నిఘా పెట్టాలి.. అది ప్రభుత్వ గుడి కాదు కదా మాకెందుకులే అని సైలెంట్ గా ఉండడం ప్రభుత్వం తప్పే అవుతుంది. అడిగితేనే చేస్తాం అనుకుంటే ఇంటిలిజెన్స్ అధికారులు ఉండి ఎందుకు.. ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని ప్రభుత్వానికి అందించే బాధ్యత వాళ్ళది.. కాశిబుగ్గ ఆలయంలోకి ఇంత మంది భక్తులు వస్తున్నా వారు కనీసం ఆ వైపు చూడను కూడా చూడలేదు.. రెవెన్యూ,పోలీస్ అధికారులకు చెప్పలేదు. చివరికి అక్కడ దుర్ఘటన జరిగి ఇంతమంది చనిపోతే కానీ అసలు విషయం బయటకు రాలేదు. ఇంతలో ఇంతమంది ప్రాణాలు పోయాయి.. మరి దీన్ని ఎవరి తప్పుగా తీసుకోవాలనేది ప్రభుత్వమే ఆలోచన చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: