ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఒకవైపు బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు పార్టీలో అన్ని విషయాలలో యాక్టివ్గానే ఉన్నారు నారా లోకేష్. గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా మారిపోయినట్టుగా కనిపిస్తోంది నారా లోకేష్ .ఎలాంటి విషయాలలోనైన సరే స్పాట్లోనే రెస్పాన్స్ అవుతున్నారు నారా లోకేష్. తాజాగా మరో రెండు అంశాలలో బాధ్యతగల పాత్ర పోషించారు. ఈ విషయాలతో భవిష్యత్ ముఖ్యమంత్రి నోడౌట్ అనే విధంగా చేశారు. వాటికి తగినటువంటి అర్హతలు తనకు ఉన్నాయని మరొకసారి నిరూపించుకున్నారు.


మొదటి అంశం ఏమిటంటే ఇటీవలే శ్రీకాకుళంలో జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇన్సిడెంట్ జరగగా,  ఇందులో 9 మందికి పైగా మరణించారు. ఈ విషయం పైన చాలామంది నారా లోకేష్ పైన ఒత్తిడి చేశారు. ముఖ్యంగా దేవాలయం కట్టించిన పాండాని అరెస్టు చేయాలని, ఆ గుడిని స్వాధీనం చేసుకోవాలని, కేస్ ఫైల్ చేయాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ వాటిని నిరాకరించి తిరస్కరించారు. వారు భక్తి భావంతోనే కష్టపడి, సొంత డబ్బులతో ఆ గుడిని నిర్మించుకున్నారని ఆ గుడిని తీసుకోవడం తప్పు అంటూ తెలియజేశారు. అలాగే గుడిని మూసివేయాలనే అంశాన్ని కూడా అంగీకరించలేదు. ఈ విషయంలో ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదని సూచించారు.



మరొక అంశం ఏమిటంటే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి క్రైస్తవులు కొంతమంది వేలంగిని మాత దేవాలయం దగ్గరికి వెళ్లారు. అక్కడ నానా రచ్చ  నడిచింది. ఆటో డ్రైవర్ల బెదిరింపులు చేశారట. కృష్ణా జిల్లాకు చెందిన క్రైస్తవులు బస్సులో ఎక్కుతున్నప్పుడు ఆటో వాళ్ళందరూ అడ్డం పడిపోయి ఈ బస్సులో వెళ్ళినటువంటి వారితో గొడవకుదిగారు. చంపేస్తామంటూ బెదిరించారు. అయితే అందులో ఉన్నటువంటి ఒక పాస్టర్ నారా లోకేష్ బృందంతో బాగా పరిచయం ఉండడంతో కాల్ చేయగానే వెంటనే లోకేష్ స్పందించి. తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ కుమారుడైన ఉదయనిది స్టాలిన్ తో మాట్లాడి పోలీస్ బలగాలను అక్కడ పంపించి దగ్గరుండి సుమారు 30 కిలోమీటర్ల వరకు ఎస్కార్ట్ తో పోలీసులు తీసుకువచ్చి తెలుగు వాళ్ళని ఆంధ్ర బార్డర్ వరకు వదిలిపెట్టేలా చేశారు నారా లోకేష్. దీంతో ప్రాంతీయ భాషా గొడవలు అనేవి లేకుండా చేశారు నారా లోకేష్. ఈ రెండు చోట్ల కూడా చాలా బాధ్యతగా వ్యవహరించారు నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: