ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు బిజెపి పార్టీ నుంచి  పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. పురందేశ్వరి తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాజకీయాలలో వినిపిస్తున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమె కుమారుడు హితేశ్ చెంచురాయ్ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్టు లభించడంతో వచ్చే ఎన్నికలలో నిలబడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు కుటుంబం ,దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం కలిసిపోయారు. వచ్చే ఎన్నికలలో హితేశ్ ను కచ్చితంగా పోటీకి దింపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట.


పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక తన కుమారుడు హితేశ్ కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించిన చాలా సార్లు అది సాధ్యం కాలేదు. పురందేశ్వరి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు .ఇప్పటికి రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలుగా కూడా పనిచేసిన ఈమె తన కుమారుడు కోసం రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి దగ్గుబాటి హితేశ్ చెంచురాయ్ మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు.


2019 ఎన్నికలకు ముందు దగ్గుబాటి హితేష్ వైసీపీలోకి చేరారు. అయితే ఆనాడు ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ విదేశాలలో ఎక్కువగా ఉన్నందువల్ల కొన్ని సాంకేతిక సమస్యల వల్ల దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు వెంకటేశ్వరరావు. ఇక పురందేశ్వరి కూడా రాజకీయాలకు స్వస్తి చెప్పి వచ్చే ఎన్నికలలో తన కుమారుడిని టిడిపి పార్టీ నుంచి పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దగ్గుబాటి హితేశ్ ను ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే దగ్గుబాటి ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: