తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈయన నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఈయన నటుడుగా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే టీవీకే  (తమిళగా వెట్రి కజగం) అనే పార్టీని స్థాపించాడు.

ఇక ప్రస్తుతం తలపతి విజయ్ "జన నాయగన్" అనే సినిమాలో నటిస్తున్న తన ఫోకస్ను ఎక్కువ శాతం రాజకీయాల పైనే పెట్టినట్లు కనిపిస్తుంది. ఈయన ఈ మధ్య కాలంలో అనేక మీటింగ్లను కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. ఇక కొన్ని రోజుల క్రితం విజయ్ ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ కారణంగా చాలా మంది చనిపోయారు. అది చాలా పెద్ద వార్తగా మారింది. ఇక ఒక విషయంలో మాత్రం విజయ్ ఫస్ట్ ఒక మాట చెప్పిన ప్రస్తుతం మాత్రం కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆ మాటను విషయంలో వెనక్కు తగినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... విజయ్ కొంత కాలం క్రితం మేము ఏ పార్టీతో కూడా కలవము. ఎలాంటి పొత్తులు పెట్టుకోము. మేము ఒంటరిగా పోటీలోకి దిగుతాం. ప్రస్తుతం తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మా పార్టీ వల్లే జరుగుతుంది అని కూడా వారు భావిస్తున్నారు. అందుకే మేము ఒంటరిగా పోటీలోకి దిగి అద్భుతమైన విజయాన్ని అందుకుంటాము అని చెప్పుకొచ్చాడు. కానీ టీవీకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రం కచ్చితంగా పొత్తు ఉండాల్సిందే. లేనట్లయితే ఓట్లు తగ్గే అవకాశం ఉంటుంది అని విజయ్ కి సూచించినట్లు , ఆ పొత్తు ఎవరితో అనేది విజయ్ కి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. మరి విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతాడా అనేది తమిళ జనాల్లో ఉత్కంఠగా మారినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: