నిజంగా అప్పటికే వేమన సతీష్‌కి ఈ కోట్లాది రూపాయలు ఇచ్చి ఉంటే, అప్పుడే ఈ విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదు? వేరే పార్టీ తరపున పోటీ చేసి, ఎన్నికలు ముగిసి, ఏడాదిన్నర తర్వాత హఠాత్తుగా ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేసిన ఆరోపణలా కనిపిస్తోంది. మరో కీలకమైన విషయం – ఆర్థిక పరిస్థితి. ఆరోపణలు చేస్తున్న సుధా మాధవి ఒక మధ్యతరగతి మహిళ. ఆమెకు పెద్దగా వ్యాపారాలు గానీ, ఆర్థిక మూలాలు గానీ ఉన్నట్లు సమాచారం లేదు. అలాంటి వ్యక్తి ఏకంగా రూ.7 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎలా సమకూర్చారో ఆమెనే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదు, వాటికి ఆధారాలు చూపాలి.పత్రికా ప్రకటనల రాజకీయం! .. కొద్ది రోజుల క్రితమే కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా టికెట్ కోసం రూ.5 కోట్లు ఇచ్చానని ఆరోపణలు చేశారు.
ఇక ఇప్పుడు సుధా మాధవి తాను టీడీపీ సభ్యత్వ కార్డు కలిగి ఉన్నానని, చంద్రబాబు కోసం దీక్షలు చేశానని చెప్పి, ఈ డబ్బుల వ్యవహారాన్ని రాజకీయ కోణం వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు వైసీపీ వర్గాలకు హాయిని కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ మహిళ వెనుక ప్రత్యర్థి పార్టీల కుట్ర ఉందో లేదో దర్యాప్తులో తేలాలి, కానీ కనీస ఆధారాల్లేని ఆరోపణలు చేయించి, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేయడం అత్యంత హేయం.వేమన సతీష్ ఒక ఎన్నారై. ఆయనకు టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి, డబ్బులు తీసుకోవాల్సిన ఆర్థిక అవసరం ఉండదని ఆయన సన్నిహితులకు, ప్రజలకు తెలుసు. ఇలాంటి కల్పిత ఆరోపణలు ప్రజా జీవితంలోకి వచ్చే వారిని నిరుత్సాహపరుస్తాయి. నిజం నిప్పులాంటిది. ఈ ఆరోపణల వెనుక ఎవరు ఉన్నారో, ఈ రాజకీయ డ్రామా ఎందుకు నడుపుతున్నారో త్వరలోనే బయటపడాల్సిన అవసరం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి