ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణవేణికి ఇళ్లు వచ్చేసింది. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ప్రాథినిత్యం వహిస్తోన్న ఉండి నియోజకవర్గం లోని ఆకివీడు మండలం కుప్పంపూడి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గతంలో కలిసిన మహిళ కంకణాల కృష్ణవేణి తనకు ఇల్లు లేదని మొరపెట్టుకోవడంతో ఆరోజు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి యువజన పథకం క్రింద ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చింది. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేవు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నేరుగా ఆ మహిళల ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. మహిళకు ఇంటి తాళాలు తో పాటు చీరతో గౌరవించి ప్రభుత్వ అధికారులే అందజేశారు.
ఆనాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు త్వరితగతిన ప్రభుత్వమే నేరుగా ఇల్లు కట్టించి ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి దక్కిన విజయంగా భావిస్తున్నట్లు ఉండి నియోజకవర్గ జనసేన ఇన్చార్జిత్తుగా నాగరాజు తెలిపారు. పవన్ కళ్యాణ్ పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందే ఉంటారని ఆయన తెలిపారు. నేడు సామూహిక గృహప్రవేశాలు త్వరితగచ్చిన లబ్ధిదారులకు ఇల్లు చేకూరడంలో స్థానిక శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు పాత్ర కీలకంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి