ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంతాల్లో ఆ వర్గానికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెను ఒక్కసారిగా ఎమ్మిగనూరు నుంచి తొలగించి కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా మార్చేయడం పార్టీకి రివర్స్ దెబ్బ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేణుక ఇప్పటికే ఎమ్మిగనూరులో కార్యాలయం ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా పార్టీ క్యాడర్‌తో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలనే వ్యూహం వేసుకున్నారు. అలాంటి సమయంలో ఇన్‌ఛార్జ్ బాధ్యతలు తీసేయడం ఆమెను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి వర్గం, బుట్టా రేణుక వర్గం మధ్య ఉన్న విభేదాలు ఈ మార్పుకు కారణమన్నా, పార్టీ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చెన్న కేశవరెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించడం కూడా రేణుక అనుచరుల్లో అసంతృప్తిని పెంచింది. వైసీపీ "రెండు వర్గాలను చెరోచోటికి పంపితే సర్దిపోతుంది" అని భావించినా, బీసీ వర్గం ఆగ్రహంతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బుట్టా రేణుక సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ఆమె తదుపరి అడుగు ఏంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మళ్లీ కొత్త నిర్ణయం తీసుకుంటే, కర్నూలు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చని అంటున్నారు. మొత్తానికి, వైసీపీ నాయకత్వం చేసిన ఈ అనాలోచిత నిర్ణయం ఎమ్మిగనూరులో రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి