“పది రోజులు కరెంట్ లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు పొలాలు ఎండిపోతున్నాయంటున్నారు. వరదలతో వైర్లు తెగిపోయాయి అంటే వాటిని సరిచేయడం మీ బాధ్యత కాదా?” అంటూ అధికారులను నిలదీశారు. ఇంతవరకు కామ్‌గా ఉండే నిమ్మల ఈసారి మాత్రం పదునైన భాషలో హెచ్చరించారు. “టౌన్‌లో పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లలో నిమిషం కరెంట్ పోయినా వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ పెడతారు, వైర్లు వేస్తారు. కానీ పల్లెటూర్లో పేదోళ్లకు మాత్రం వారం, పది రోజులు కరెంట్ రావడం లేదు. ఇది ఏం న్యాయం?” అని ప్రశ్నించారు. డబ్బున్నవాళ్లకు జనరేటర్లు, ఇన్‌వర్టర్లు ఉన్నా, పేద రైతులు మాత్రం బోర్లు ఆగిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. నిమ్మల రామానాయుడు అంతే కాదు - “వారం క్రితం చెప్పినా మీరు ఇంకా పని పూర్తి చేయలేదంటే, ఈ నిర్లక్ష్యం ఎక్కడి నుంచి వస్తోందో అర్థం అవుతోంది” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
వైసీపీ పాలనలో అధికారులకు అలవాటైన నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతోందని మండిపడ్డారు. “కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతోంది, కానీ కొందరు అధికారులు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వ శైలిలోనే ఉన్నారు. ఇది అసహ్యం. ఇకపై ఇలాంటి పనితీరు సహించం” అంటూ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. నిమ్మల ఈ ఆగ్రహం జిల్లా అధికారులకు పెద్ద షాక్ ఇచ్చింది. సాధారణంగా శాంతంగా వ్యవహరించే ఆయన ఈసారి సీరియస్ కావడం పార్టీ క్యాడర్‌లో చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యలపై మంత్రి నేరుగా స్పందించడాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి, ఈ సంఘటనతో “సౌమ్య మంత్రి నిమ్మల కూడా కోపంతో మండిపడాల్సి వచ్చింది అంటే, అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి” అన్న మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి