ప్రముఖ హిందీ న్యూస్ ఛానెళ్లు ఎన్నికల విశ్లేషణ చేస్తుండగా.. స్క్రీన్ కింద, పక్కన ఉన్న భారీ యాడ్ స్లాట్స్‌లో బాలకృష్ణ అఘోరా గెటప్ పోస్టర్లు స్పష్టంగా కనిపించాయి. "డిసెంబర్ 5న థియేటర్లలో" అంటూ రిలీజ్ డేట్‌ను యాడ్ చేయడం ద్వారా.. జాతీయ స్థాయిలో కోట్లాది మంది ప్రేక్షకులకు 'అఖండ 2' గురించి ఒక్క దెబ్బతో చేరవేశారు! ఇది మామూలు స్కెచ్ కాదు.. పక్కా పాన్ ఇండియా మాస్టర్ ప్లాన్! ఈ ప్రమోషన్ వెనుక ఉన్న వ్యూహం మామూలుది కాదు. ఎన్నికల ఫలితాల రోజున న్యూస్ ఛానెళ్ల టీఆర్‌పీ రేటింగ్స్ (TRP Ratings) ఆకాశాన్ని తాకుతాయి. కొన్నిసార్లు క్రికెట్ బిగ్ మ్యాచ్‌ల వ్యూయర్‌షిప్‌ను కూడా ఇవి దాటేస్తాయి.
ఇక ఇలాంటి అత్యంత ఖరీదైన, హై- విజిబిలిటీ స్లాట్‌లో ఒక తెలుగు సినిమా ప్రకటనలు రన్ చేయడం అంటే.. నిర్మాతలు హిందీ మార్కెట్‌పై ఎంత నమ్మకంగా ఉన్నారో, ఎంత భారీగా ఖర్చు చేస్తున్నారో అర్థమవుతోంది. 'అఖండ 1' హిందీ డబ్బింగ్ యూట్యూబ్‌లో, శాటిలైట్ ఛానెళ్లలో రికార్డులు సృష్టించడంతో.. ఉత్తరాది ప్రేక్షకుల్లో బాలయ్య మాస్ యాక్షన్‌కు ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ క్రేజ్‌ను థియేటర్ల రూపంలో క్యాష్ చేసుకునేందుకు.. ముంబైకి చేరుకున్న బాలయ్య, బోయపాటి ఈ ఎన్నికల వేళ ఈ అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేశారు. మొత్తానికి, 'అఖండ 2' ప్రమోషన్.. సినిమా ప్రపంచంలోనే ఒక కొత్త, సంచలన అధ్యాయాన్ని లిఖించింది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి