అయితే ఈ పరిణామాల పైన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు.. ఇది చాలా కఠినమైన నిర్ణయం అయినప్పటికీ కూడా జట్టు కూర్పును పరిగణంలోకి తీసుకోవడం వల్లే తప్పడం లేదని తెలిపారు. ఈ విషయంపై జడేజాతో కూడా జట్టు సభ్యులు మాట్లాడారని అతడి ఈ నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆ తరువాతే ఈ ఒప్పందం కొనసాగించినట్లుగా తెలిపారు విశ్వనాథన్. ఇది చాలా కఠినమైన నిర్ణయం అయినప్పటికీ కూడా తప్పలేదు.
కొన్నేళ్లపాటు సీఎస్కే విజయాలలో కీలకమైన ప్లేయర్గా జడేజా ఉన్నారు. అతడిని పక్కన పెట్టడం అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటని, కానీ జట్టు కూర్పును దృష్టిలో పెట్టుకొని ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ట్రేడింగ్ చేసుకొనే సమయంలో సంబంధిత ఆటగాళ్లను కూడా సంప్రదించాలని తెలిపారు. వారు ఒప్పుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని తెలిపారు. అయితే జడేజాతో మాట్లాడుతున్న సమయంలో అతడు తన కెరియర్లో ప్రస్తుతం చివరి దశలో ఉన్నాడనే విషయాన్ని అంగీకరించారు. జడేజానే కాదు సీఎస్కే టీమ్ లో ఉన్న ఆటగాళ్లలో కొంతమంది కెరియర్ చివరి దశలో ఉన్నారంటూ తెలిపారు విశ్వనాథన్. రాబోయే రెండు మూడేళ్లలో సీఎస్కే టీమ్ రూప్ రేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. జడేజాను వదిలేయడం వల్ల అభిమానులు బాధపడతారని మాకు తెలుసు కానీ జట్టు కూర్పు, ప్రస్తుత పరిస్థితిని పరిగణంలోకి తీసుకున్న తర్వాతే మేనేజ్మెంట్ ఇలా చేసిందని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి