ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పైన ఆందోళన చెందుతూ ఒక ట్విట్ చేశారు. ఈ విషయాన్ని వైసిపి నేతలు, కార్యకర్తలు వైరల్ గా చేస్తున్నారు. జగన్ తన సోషల్ మీడియా ట్విట్టర్ లో ద్వారా కాగ్ నివేదికలను పోస్ట్ చేస్తూ తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడులు, పెరిగిపోతున్న రుణభారం అంటూ ట్విట్టర్లో షేర్ చేశారు. రోజురోజుకి ఏపీ రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతోందని కాగ్ నివేదికలు విడుదల చేసిన గణాంకాలతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయంటూ తెలియజేశారు.


సంపద సృష్టిస్తామంటూ టిడిపి, జనసేన నేతలు చెప్పినప్పటికీ వాటికి విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వ పనితీరు గమనిస్తూ ఉంటే వారి వైఫల్యాలు కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయంటూ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను , వార్షిక ఆదాయాల వృద్ధి కేవలం 7.03% ఉన్నదని 2025-26 లోనైన రాష్ట్రం ఆర్థికంగా పైకి ఎదుగుతుందని చాలామంది భావించారు. కానీ కాగ్ నివేదికలు విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.



అయినా కూడా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రజలను నమ్మించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటు జగన్ ప్రశ్నించారు. 2024- 25  ఆర్థిక సంవత్సరంలో GSDP వృద్ధిని 12.02% ఉందంటూ ప్రభుత్వం ప్రకటించింది.. 2025-26 ఆర్థిక ఏడాదిలో ఆ వృద్దిని 17.1%  లక్ష్యంగా పెట్టుకొని వెళ్తున్నారు. కానీ ఫలితాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నట్టు కాగ్ నివేదికలు  చెబుతున్నాయని తెలిపారు. సంపద సృష్టించ లేకపోవడంలో రాష్ట్రం తిరోగమనంలో ఉన్నదని కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళుతోందని మాట్లాడుతున్నారు. అసలు అలా ఎలా మాట్లాడుతున్నారంటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: