తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఎలాంటి వాతావరణం ఉంటుందో చెప్పడం కష్టంగా మారుతుంది. వానాకాలం ఎండలు కొట్టడం,ఎండాకాలం వర్షాలు కొట్టడం,చలికాలం తుఫాన్లు, వానలు రావడం ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా చలికాలం స్టార్ట్ అయినా ఇంకా వానకాలం పోలేదే అనుకున్న సమయంలో తుఫాన్ వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలను అస్తవ్యస్తం చేసి పడేసింది. పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇలా ఎన్నో జరిగాయి. ఇక ఇప్పుడు తుఫాను పోయింది అనుకుంటే చలి పులిలా  వణికిస్తోంది. అయితే మరోసారి ఏపీకి ముప్పు రాబోతోందట. అదేంటంటే వచ్చేవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. 

అండమాన్ సముద్రంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడానికి పరిస్థితులు ఎక్కువ అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు.. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ తమిళనాడు తీరం వైపు నుంచి తీవ్ర తుఫాన్ గా మారబోతుందని చెబుతున్నారు. నవంబర్ 24 నుండి 30 మధ్య ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని,తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ అల్పపీడనం కారణంగా రాబోయే రెండు మూడు రోజుల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అక్కడక్కడ రాష్ట్రంలో పొడి వాతావరణం కూడా నెలకొంటుందని, దక్షిణభారతంపై చలిగాలులు ఎక్కువగా వీస్తుండడం వల్ల రాయలసీమ కోస్తా జిల్లాలలో చలి విపరీతంగా పెరిగిపోతుందని తెలియజేస్తున్నారు. ఇక రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతుందట. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ తమిళనాడు తీరం వైపు కదలడంతో ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: