కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం తిమ్మనోనిపల్లి గ్రామంలో పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామంలోని అన్ని వార్డులను ఎస్సీ ఎస్టీలకు కేటాయించారని, అయితే బీసీల జనాభా ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువగా ఉందని పిటిషనర్ వాదన వినిపించారు. అదే విధంగా వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లోనూ ఇలాంటి అన్యాయం జరిగిందని మరో పిటిషన్ ద్వారా కోర్టుకు తెలియజేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూల్స్‌ను ఉల్లంఘించిందని పిటిషనర్లు ఆరోపించారు.
హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జనాభా డేటాను ఆధారంగా చేసుకుని వాదనలు వినిపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన న్యాయవాది కొంత సమయం కావాలని కోరారు. దీంతో జస్టిస్ టి మాధవి దేవి ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రవ్యాప్త పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం
రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను స్టే విధించే అవకాశం కనిపిస్తోంది. గతంలోనూ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్‌కు హైకోర్టు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పుడు మరోసారి రిజర్వేషన్ల కేటాయింపు అక్రమమని నిరూపితమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఎంబరాస్‌మెంట్ తప్పదు. కోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి