ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పైనే అవుతోంది. కేంద్రం ,రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉండడంతో ప్రజా సమస్యల పైన పార్లమెంట్లో ప్రశ్నలు అడగడం లేదని కేంద్రాన్ని నిలదీయడం లేదంటూ చాలానే విమర్శలు నేతల మీద వినిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలోనే నరసరావుపేట టిడిపి ఎంపీ పార్లమెంట్ పార్టీ నేతగా పేరు సంపాదించిన లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ తన ట్విట్టర్ వేదికగా ఒక విషయాన్ని ప్రకటించారు. అదేమిటంటే మీ సమస్యలు చెప్పండి? వాటిని తాను పార్లమెంట్లో అడుగుతాను అంటూ బహిరంగంగానే ప్రకటన చేశారు.


నరసరావుపేట ఎంపీ  లావు శ్రీకృష్ణదేవరాయలు.. ట్విట్టర్ ద్వారా ఇలా తెలియజేస్తూ ప్రియమైన యువ మిత్రులారా మరియు ఆంధ్రప్రదేశ్ యువత, ఈరోజు నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి నేను మీ నుండి వినాలనుకుంటున్నాను..! tdp పార్లమెంట్ పార్టీ నాయకుడిగా నాతోటి టిడిపి ఎంపీలతో కలిసి ఏపీ రాష్ట్ర మరియు మీ భవిష్యత్తు కోసం మార్పు తీసుకోవడానికి పార్లమెంటులో లేవనెత్తాల్సిన సమస్యలు ఏంటి అంటూ ప్రశ్నించారు?. ఈ సమస్యలలో మీరు కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.


జాతీయ వేదిక పైన ముఖ్యమైన అంశాలపై దేశం దృష్టిని ఆకర్షించడానికి అందరం కలిసి పని చేద్దాము వాటిని సాధించుకుందాం అంటూ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఏపీకి చెందిన ఏ ఎంపీ కూడా ఇలాంటి ప్రకటన అయితే చేయలేదు. దీంతో టిడిపి ఎంపీ ప్రతిపాదన ఇప్పుడు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా చాలామంది లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రశంసిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండడంతో ప్రజలు కూడా కూటమి పైన ఎక్కువగానే అంచనాలు పెట్టుకున్నారు. గతంలో పోలిస్తే కేంద్రం నుంచి ఏపీకి సహాయం కూడా ఎక్కువగానే ఉన్నది. ప్రస్తుతం టిడిపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి ఈ ప్రతిపాదన అందరూ ఎంపీలు అనుసరిస్తే బాగుంటుందని  చాలామంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: